వైరల్ వీడియో: రోగి కోసం గుండెను తీసుకెళ్తూ.. హాస్పిటల్‌పైనే కుప్పకూలిన హెలికాప్టర్.. కానీ చివరకు..?!

వేరే వారికి జీవితాన్ని ప్రసాదించే గొప్పదానం ఏదైనా ఉంది అంటే అది అవయదానం.ఒకవేళ మన ఆయుష్షు పూర్తి అయ్యి చనిపోయిన తర్వాత కూడా మన శరీరానికి సంబంధించిన అవయవాలు వేరే వారికి ఉపయోగపడే విధంగా దానం చేస్తే అది ఇంకొకరికి జీవితాన్ని ప్రసాదిస్తాయి.

 Helicopter Crashes While Delivering Heart To Hospital, Helicopter Crash, Deliver-TeluguStop.com

ఇందులో భాగంగానే తాజాగా ఓ వ్వక్తి చేసిన అవధానం వల్ల పేషెంట్ కు అమర్చాలిసిన గుండె అనుకోకుండా ప్రమాదానికి గురి అయ్యింది.ఒక వ్యక్తి గుండెను ఇంకొక వ్యక్తికి అమర్చేందుకు ఆ గుండెను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలిస్తుండగా ఆ గుండె 2 ప్రమాదాలకు గురి అయ్యింది.

అయితే అదృష్టవశాత్తు ఆ గుండెకు ఎటువంటి ప్రమాదం కలగలేదు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

గుండెను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తీసుకుని వెళ్లే సమయంలో రోగికి ఆపరేషన్ చేయాల్సిన హాస్పిటల్ వద్దకు చేరుకున్న హెలికాఫ్టర్ రానేవచ్చింది.అయితే మరి కొద్ది క్షణాల్లో హెలికాఫ్టర్ ల్యాండ్ కాబోతున్న సమయంలో అనుకోకుండా హాస్పిటల్ పైన ఆ హెలిప్యాడ్ పై అనుకోకుండా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.

అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరికి ఏమి కాకపోగా, ఆ గుండెకు కూడా ఎటువంటి ప్రమాదం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే అదే గుండెకు మరోసారి ప్రమాదం సంభవించింది.

ఆ గుండె ఉన్న బాక్స్ డాక్టర్ చేతిలో ఉండగా అతను హెలికాప్టర్ ప్రమాదం నుండి బయట పడిన తర్వాత పక్కకి వెళ్తున్న సమయంలో ఏదో వైర్ తగలడంతో ఆయన అక్కడే కిందపడిపోయాడు.దీంతో అతని చేతిలో ఉన్న గుండె కూడా కింద పడిపోయింది.ఇది గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతడిని, అతనితోపాటు ఆ గుండెని త్వరగా లేపి చూశారు.అయితే అది చూసిన డాక్టర్లు ఒకింత షాక్ కు గురయ్యారు.

దాత త్యాగం వృధా అవుతుందో అని అనుకున్న వారు.అలాగే ఆ గుండె అమర్చాలిసిన రోగి పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందారు.

అయితే అదృష్టం కొద్దీ ఆ గుండెకు రెండుసార్లు ప్రమాదాలు జరిగిన ఎటువంటి హాని జరగక పోవడంతో అది సురక్షితంగానే చేరాల్సిన వ్యక్తికి చేరింది.దీంతో ఆ గుండెను తీసుకొని డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాల్సిన వ్యక్తికి గుండెను అమర్చారు.

నిజంగా ఆ రోగి ఎంత అదృష్టవంతుడు అయితే రెండుసార్లు ప్రమాదం జరిగిన అతనికి రావాల్సిన గుండె అతనికి చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube