వైరల్ వీడియో: స్నానం చేస్తూ నిద్రపోయాడు.. చివరికి లేచి చుస్తే..!?

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఎవరి పనిలో వారు నిమగ్నమై చివరికి నిద్రపోవడానికి కూడా సమయం లేకుండా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు.కొన్ని సందర్భాలలో అలసటగా అనిపించినప్పుడు, పనిచేస్తున్నప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాం.

 Viral Video He Fell Asleep While Taking A Bath What If He Finally Wakes Up,  Sle-TeluguStop.com

మరికొందరు అయితే సినిమా థియేటర్లలో నిద్రపోతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.కానీ మీరు ఎప్పుడైనా స్నానం చేస్తూ నిద్రపోవడం అన్న అంశం విన్నారా.!? అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి తాజాగా చోటుచేసుకుంది.సాధారణంగా ఒంటిపై కాస్త నీళ్లు పడగానే వెంటనే నిద్ర లేచిపోతాం.

కానీ, ఒక వ్యక్తి మాత్రం బాత్ టబ్ లో స్నానం చేస్తూ నిద్రపోయాడు.

అలా టబ్ లో నిద్రపోయిన కాస్త సమయం తర్వాత బబుల్స్ ( సబ్బు నురగ) బాగా పెరిగిపోయాయి.

ఆ బబుల్స్ కాస్తా బాత్ టబ్ మొత్తం నిండిపోయి అనంతరం బాత్ రూమ్ మొత్తం విస్తరించింది.ఇంతలో ఏమైందో ఏమో అని చూసేందుకు వచ్చింది ఒక మహిళ.

ఈ కథనాన్ని మొత్తం ఆ మహిళ దగ్గర ఉన్న ఫోన్ కెమెరాలో బంధించి, నువ్వు బాగున్నావా.? అని ఆ వ్యక్తిని నిద్రలేపింది.అప్పుడు ఆ వ్యక్తి మేలుకొని నిద్ర వచ్చింది అంటూ ఊపిరి ఆడక దగ్గడం మొదలు పెట్టాడు.

ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.మా నాన్న టబ్ లో నిద్రపోయాడు అనే క్యాప్షన్ ను జతచేశారు.ప్రస్తుతం సామాజిక వర్గంలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

నెటిజెన్స్ ఈ వీడియోకి పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇందులో ఓ నెటిజన్.

ఇతను 2020 నుంచి తప్పించుకున్నాడు.కానీ, 2021 లో బబుల్స్ చేతిలో చిక్కుకుపోయాడు, అతను నిద్ర లేచిన అనంతరం కూడా క్షేమంగా ఉన్నందుకు చాలా సంతోషం అంటూ కామెంట్ చేసాడు.

మరికొందరు అయితే అన్ని బబుల్స్ ఎలా వచ్చాయో అర్థం కాలేదంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube