వైరల్ వీడియో: నిజమైన ' వేనమ్ ' వేటను చూసారా ఎప్పుడైనా..?!

ఇప్పుడు సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక రకరకాల వీడియోలు మనకి కనిపిస్తున్నాయి.చిత్ర విచిత్రమైన జంతువులు గురించి మనకు తెలుస్తుంది.

 Viral Video Have You Seen The Real Venom Hunting, Viral Video, Viral Latest, Vir-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో జంతువులకు సంబందించిన వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.ఇప్పుడు తాజాగా ‘ వెనమ్’ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.

వెనమ్ గురించి తెలియని వారు ఉండరు.ఎందుకంటే ‘స్పైడర్‌ మాన్’ సినిమాల్లో ఈ ‘వెనమ్’ బాగా పాపులర్ అయింది.

చూడడానికి నల్లటి ఆకారంతో ఉంటుంది.ఒక విధంగా చెప్పాలంటే రాక్షసి బల్లిలాగా ఉంటుంది అన్నమాట.

అయితే సినిమాల్లో ‘వెనమ్’ ను ప్రత్యర్థులతో పోరాడుతున్న సమయంలో వాళ్ళని తినేస్తున్నట్లు చూపిస్తారు.కానీ అది కేవలం కల్పితం మాత్రమే.

అయితే ఇప్పుడు మీరు నిజంగానే ‘వెనమ్’ను ఈ వీడియోలో చూడవచ్చు.వెనమ్ వేటాడితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరే స్వయంగా చూడవచ్చు.వెనమ్ కి బలి అయ్యిన జంతువు ఏంటి అనుకుంటున్నారు.ఒక పీత వెనమ్ చేతికి చిక్కి దానికి ఆహారంగా మారిపోయింది.

మరి ఈ పీతను వింత జంతువులా కనిపించే ‘వెనమ్’ ఎలా వేటాడుతోందో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

అయితే ‘వెనమ్’లా కనిపించే ఈ జంతువు పేరు మెరైన్ ఫ్లాట్‌వారమ్.

ఇవి చాలా అరుదైన జాతికి చెందిన జీవులుగా పరిగణిస్తారు.ఈ జంతువులు ఎక్కువగా సముద్రపు అంచులు, పగడపు దిబ్బలలో మనకి తారస పడుతూ ఉంటాయి.ఉప్పునీటిలోనే ఎక్కువగా ఇవి కనిపిస్తాయి.

మంచి నీటిలో ఇవి కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది.అయితే ఈ వీడియో ఎప్పటిదో అయినా గాని మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఒక పీతను గట్టిగా పట్టుకుని తినాలని చూస్తుంది.పీత ఎంతలా దాని నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన వెనమ్ వదలలేదు.

ప్రస్తుతం ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ తో పాటు కామెంట్స్ కూడా వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube