టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ( MS Dhoni )కి కార్లు, బైక్‌లంటే అమితమైన ఇష్టం.అతను ఇటీవల రాంచీలోని తన సీక్రెట్ గ్యారేజీలో తన కార్లు, బైక్‌ల కలెక్షన్‌ను మరో ఇద్దరు మాజీ క్రికెటర్లు అయిన వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషికి చూపించాడు.
ప్రసాద్( Prasad ) ధోనీ కలెక్ట్ చేసిన ఓల్డ్ బైక్స్, కార్లు చూసి చాలా ముగ్ధుడయ్యాడు.ధోనీ ఒక గొప్ప అచీవర్ అని, ఇన్‌క్రెడబుల్ పర్సన్ అని ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు.
అంతేకాదు రాంచీ రెసిడెన్స్ లో ధోనీ కార్, బైక్ కలెక్షన్ ఎలా ఉందో చూడండి అంటూ ఒక వీడియో కూడా అందరితో పంచుకున్నాడు.
దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ధోనీ మాజీ క్రికెటర్లతో కలిసి మొదటగా కనిపించాడు.ఆ తర్వాత అతని గ్యారేజీ కనిపించింది.అది చాలా పెద్దగా ఉండటం గమనించవచ్చు.
ఆ గ్యారేజీ రెండు అంతస్తుల ఎత్తు ఉంది.పై అంతస్తులో బైకులను పార్కు చేసి ఉంచారు.
ఐకానిక్ కార్లు కింద ఫ్లోర్‌లో కనిపించాయి.బైక్ ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇది బైక్ షో రూమ్ హా? అంటూ ఫన్నీగా మాజీ క్రికెటర్లు కామెంట్లు చేశారు.అయితే తనకు వెహికల్స్ అంటే చాలా ఇష్టం అంటూ ధోనీ కామెంట్స్ చేశాడు.అందుకే ఇంత పెద్ద బైక్, కార్ల కలెక్షన్ చేసినట్లు వెల్లడించాడు.
ఇకపోతే 2024లో జరిగే ఐపీఎల్‌లో ధోని పాల్గొనడంపై ఊహాగానాలు ఉన్నాయి.అయితే, రాబోయే సీజన్‌లో చెన్నై( Chennai Super Kings )కి చెందిన ఫ్రాంచైజీకి ఆడేందుకు ధోనీ తిరిగి వస్తున్నట్లు ధృవీకరించారు.గతంలో ధోనీ సారథ్యంలోని చెన్నై ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాడు.