వైరల్ వీడియో: రెయిన్ బో పైథాన్ ను చూసారా ఎప్పుడైనా..?!

పాములంటే అందరికీ భయం.దూరంగా పాము వెళ్లడాన్ని చూస్తే చాలు కాళ్లు గజగజా వణుకుతాయి.

 Viral Video Have You Ever Seen The Rainbow Python, Viral Video, Viral Latest, Ne-TeluguStop.com

పాముల్లో అనేక రకాలు ఉన్నాయి.కొన్ని హాని చేసేవిగా ఉంటే.

మరికొన్ని మంచి చేసేవి ఉన్నాయి.నేటి రోజులలో అనేక పాముల జాతులు నశించిపోయాయి.

ఇప్పుడున్న వాటిలో కూడా కొన్ని జాతులు నశించిపోతున్నాయి.ఇకపోతే తాజాగా ఓ అరుదైన పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా పాములలో చాలా తక్కువగా కనిపించేటటువంటి పాములలో రెయిన్బో పైథాన్ పాము కూడా ఉంది.ఈ రెయిన్బో పైథాన్ పాము ఎక్కువగా కాలిఫోర్నియా ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది.

ఈ ప్రాంతంలోనే కాదు స్థానికంగా ఉండే దేశాల్లోని ప్రాంతాల్లో కూడా ఈ పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఈ రెయిన్బో పైథాన్ పాములో అనేక రంగులు ఉంటాయి.

ఈ పాము చూసిన ఎవరైనా దానినే చూస్తూ ఉండిపోతారు.ఈ రెయిన్బో పాము కొండచిలువ జాతికి చెందిన పాముగా ఉంది.

అంటే ఈ పాములో విషం అనేది ఉండదు.అయితే ఈ పాము దేన్నైనా బలంగా పట్టుకుని ఊపిరి లేకుండా చేసి చంపడం దీని నైజం.

ప్రస్తుతం ఈ రెయిన్బో పైధాన్ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాలిఫోర్నియా దేశానికి చెందిన రెప్టైల్ జూను స్థాపించినటువంటి జే బ్రూయ‌ర్ ఈ పాముకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్టు చేశాడు.

మామూలుగా తన జూలో ఉన్నటువంటి జంతువులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఈ వ్యక్తి షేర్ చేస్తూ ఉంటాడు.తాజాగా ఇప్పుడు కూడా తన జూలోని రెయిన్బో పైథాన్ పాము వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌ లో పోస్టు చేయడంతో అందరూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.ఈ వీడియోను కొన్ని రోజుల ముందు పోస్టు చేయడంతో దీనిని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది వీక్షించారు.ఇంకెందుకు ఆలస్యం ఈ రంగురంగుల పైథాన్ వీడియోను కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube