వైరల్ వీడియో: ఇలాంటి బౌలింగ్ ఎప్పుడైనా చూసారా..?!

క్రికెట్ ఆడడం అంటే చాలా మందికి ఇష్టం.మరికొందరికి ప్రాణం.

 Viral Video Have You Ever Seen Bowling Like Thiscrickerter, Spin, Batting, Bowli-TeluguStop.com

ఇక మన భారతదేశంలో క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్రికెట్ కు ఉన్న ప్రాధాన్యత ఏ ఆటకు లేదంటే నమ్మండి.

ఇక క్రికెట్ ఆడవారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వారి బౌలింగ్ వేయడంలో దిట్ట.బాల్ ను చేతిలో పట్టుకొని చాలా వినూత్న రీతిలో బౌలింగ్ చేస్తూ ఉంటారు.

కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేస్తుంటే, మరికొందరు స్పిన్ బౌలింగ్ చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సందర్భాలలో ఇలా బౌలింగ్ చేయడం వలన వివాదాలని కూడా కొనితెచ్చుకుంటారు.

కానీ, తాజాగా ఒక బౌలర్ విచిత్రంగా బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.భరతనాట్యం డాన్స్ చేసే వారిలా రెండు, మూడు సార్లు తిరుగుతూ బంతిని వేయడం మనం వీడియోలో గమనించవచ్చు.

ఈ వీడియోను భారత క్రికెటర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు.

ఈ పోస్ట్ కు యువరాజ్ సింగ్ భరతనాట్యం స్టైల్ లో బౌలింగ్ చేయడం అంటూ పోస్ట్ చేశాడు.

అంతేకాకుండా ఈ వీడియోను భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ షేర్ చేస్తూ ఏమంటావ్ బజ్జి ? అంటూ పోస్ట్ చేశాడు.ఇక ఈ వీడియోను చూసిన కొందరు నెటిజెన్స్ వారి రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరికొందరు అయితే బాల్ కంటే ఎక్కువగా తిరుగుతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube