వైరల్ వీడియో: శునకం ఇలా చేయడం ఎప్పుడైనా చూసారా..?!

మనలో చాలా మంది సాధారనంగా ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటు ఉంటారు.ఇందులో ఎక్కువ శాతం శునకాలను తెచ్చుకొని పెంచడం మనం చూస్తూనే ఉంటాం.

 Dog, Dog Viral Video, House Top,ladder, Social Media, Viral Latest,viral,social-TeluguStop.com

అంతే కాకుండా వాటిని ఇంట్లోనే ఒక వ్యక్తి లాగా భావించడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇలా ఒక ఇంటి యజమాని 2 కుక్కలను పెంచుకునే వాడు.

ప్రతిరోజు లాగానే ఆ 2 కుక్కలు ఎక్కడ ఉన్నాయి అని వెతుకుతున్న తరుణంలో ఒక కుక్క మాత్రమే కనిపించింది.రెండో కుక్క కనపడకపోవడంతో ఇంటి ఆవరణంలో మొత్తం వెతకడం మొదలుపెట్టాడు.

ఇంటి వాకిలి మాత్రం మూసే ఉంది.కానీ, కుక్క ఎక్కడికి వెళ్ళిందో అని ఆలోచిస్తూ ఉండగా.మొదటి కుక్క ఒక నిచ్చెన దగ్గరకు వెళ్లి అరవడం మొదలు పెట్టింది.దీనితో ఆ యజమాని ఏం జరిగిందా అని నిచ్చెన ఎక్కి చూసేసరికి ఒక్కసారిగా ఇంటి పై కప్పు పై ఇంకో కుక్క కనపడేసరికి షాక్ కు గురయ్యాడు.

దీంతో అప్పుడు అతనికి అర్థం అయ్యింది ఆ శునకం నిచ్చెన ఎక్కి మరి ఇంటి పైకి వెళ్లిందని.

వాస్తవానికి ఒక్కోసారి మనమే పెద్ద నిచ్చెన ఎక్కాలంటే భయపడుతూ ఉంటాము.

కానీ, ఆ కుక్క మాత్రం ఎంతో సులువుగా అనుభవం ఉన్న దానిలాగా ఆ పెద్ద నిచ్చెన ఎక్కి ఇంటి పైకి వెళ్ళిపోయింది.ఇంతకీ ఆ కుక్క ఎలా ఎక్కిందో అని ఆ ఇంటి యజమాని సీసీ కెమెరా ఫుటేజ్ చూడగా.

అచ్చం మనిషి లాగానే ఏ మాత్రం భయపడకుండా శునకం చాలా సులువుగా నిచ్చెన ను ఎక్కింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూసేయండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube