వైరల్ వీడియో: కరోనా దెబ్బకు వినూత్నంగా చేసుకున్న హల్దీ వేడుక…!  

Haldi Celebrations with Paint Roller Viral Video, Haldi Celebrations , Paint Roller ,Viral Video, Social media, corona effect, Social Distance - Telugu Corona Effect, Coronavirus, Haldi Celebrations, Haldi Celebrations With Paint Roller Viral Video, Marriage, Paint Roller, Social Distance, Social Media, Viral Video

భారతదేశం లో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజురోజుకి వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి దైనందిక జీవితాలను గడుపుతున్నారు.

TeluguStop.com - Viral Video Haldi Celebrations Paint Roller

దీని ప్రభావంతో ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరగా ఉండడానికి కూడా చాలా భయపడి పోతున్నాడు.ఇందులో భాగంగానే కరోనా రావడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు.

తాజాగా వినూత్నంగా చేసిన ఓ పని తెగ నవ్వు తెప్పిస్తుంది.

TeluguStop.com - వైరల్ వీడియో: కరోనా దెబ్బకు వినూత్నంగా చేసుకున్న హల్దీ వేడుక…-General-Telugu-Telugu Tollywood Photo Image

కరోనా నేపథ్యంలో చాలా మంది వారి పెళ్లిలను పోస్ట్ పోన్ చేసుకున్నారు.

మరికొందరు ఎలాగో లాగా పెళ్లి తంతు జరిపిస్తున్నారు.పెళ్లి సమయములో వధూవరులకు మంగళ స్నానం చేయించేటప్పుడు పసుపు రాస్తారు.

మాములుగా పెళ్లి తంతు జరిగినప్పుడు కొన్ని సంప్రదాయాల ప్రకారం పసుపు పూసే (హల్దీ వేడుక ) కార్యక్రమము చేయడము ఒకటి ఆచారం.ఈ పసుపు రాసే కార్యక్రమంలో మనము వధూవరులను తాక వలసి వస్తుంది.

కానీ, అలా తాకకుండా పసుపు రాయడానికి ఒక కొత్త పద్ధతిని ఏర్పాటు చేశారు.నిజంగా ఈ ఆలోచన చూస్తే నవ్వు ఆపుకోకుండా ఉండరు.

అలా ఎందుకంటే… పెయింటింగ్ వేసే రోలర్ తో వధూవరులకు పసుపు పూస్తున్నారు.నిజానికి వారి క్రియేటివిటీకి మెచ్చుకోవచ్చు.

ఇందుకు సంబంధించి ప్రస్తుతం వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.మాస్కు ధరించిన ఒక ముత్తయిదువు ఒక పొడవైన కర్రకు పెయింటింగ్ వేసే రోలరు కట్టి దానితో వధువుకు పసుపు పూయడం (హల్దీ వేడుక) జరిగినది.

ఈ వినూత్న పద్ధతిని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇంకా రాను రాను కరోనా వల్ల కొత్త పద్ధతులు ఎన్ని చూడవలసి వస్తుందో అర్థం కావడం లేదు.

#Marriage #Corona Effect #Viral Video #Social Distance #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Haldi Celebrations Paint Roller Related Telugu News,Photos/Pics,Images..