వైరల్ వీడియో: ఈ జంతువు ఏంటో గుర్తు పడతారా...?

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువైనప్పుడు నుంచి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా లో అనేక జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.ఇక తాజాగా ఓ పిల్లి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.20 వ దశకంలో హాలీవుడ్ లో ఓ సినిమా లో వచ్చిన జంతువు వలే అచ్చం పోలి ఉండడంతో సదరు వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.ఆ సినిమాలో బొమ్మలకు రబ్బర్ సూట్లు తొడిగి నటింప చేసినవి.

 Hairless Cat With No Eyes Viral Photos, Jasper Cat, Social Media, Cat Health, Ha-TeluguStop.com

అవి చూడటానికి ఎంతో వెరైటీగా అనిపించేవి.అయితే అప్పుడు రబ్బరు బొమ్మలు కాగా, ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో ఉన్నది మాత్రం నిజమైన పిల్లే.

సదరు పిల్లికి కనుగుడ్లు, బొచ్చు లేవు.ఆ పిల్లి పేరు జాస్పర్.అయితే ఈ వీడియోని కొంతమంది చూసిన తర్వాత జాలి పడుతూ బాగా కనెక్ట్ అవుతున్నారు.ఈ జంతువు పేరు మీద టిక్ టాక్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లలో అకౌంట్ కూడా ఉన్నాయి.

అన్నిట్లో కూడా వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు.దీనికి ఇంతలా ఎందుకు ఫాలోయింగ్ అంటే ఇది మిగతా పిల్లులతో పోలిస్తే అరుదైన పిల్లిలా కనిపించడమే.

ఇక ఈ పిల్లి విషయానికి వస్తే జాస్పర్ కు 12 ఏళ్ల వయసు.ఇక ఈ పిల్లి మొదట్లో బాగానే ఉన్నా… కొన్ని సంవత్సరాల తర్వాత దీనికి ఫెలైన్ హెర్ప్స్ వైరస్ సోకడంతో ఆ పిల్లి శరీరం మీద ఉన్న బొచ్చు మొత్తం పూర్తిగా ఊడిపోయింది.

ఒకవైపు ఈ వైరస్ తనని ఇబ్బంది పెడుతున్న సమయంలోనే ఆ పిల్లి కుడి కన్ను కు కార్నియా అల్సర్ కూడా అయ్యింది.అయితే అతి కొద్ది కాలంలోనే దాని తీవ్రత ఎక్కువ అవడంతో చివరికి ఆ పిల్లి కుడికన్ను కూడా తొలగించారు.

అయితే దురదృష్టవశాత్తు ఆ సమస్య ఎడమ కన్ను కు చేరుకుంది.దీంతో ఆ కన్నును కూడా తీసేయాల్సి వచ్చింది.అన్ని చికిత్సల తర్వాత కూడా ఆ పిల్లి చనిపోతుందని అందరూ భావించిన క్రమక్రమంగా ఆ పిల్లి ఆరోగ్యం బాగా మెరుగుపడింది.ప్రస్తుతం ఆ పిల్లి కి బొచ్చు లేకపోయినా, కళ్లు లేకపోయినా ఆరోగ్యం గానే జీవిస్తోంది.

గత సంవత్సరం ఈ పిల్లికి గుండెపోటు కూడా వచ్చిందంట మరి.ప్రస్తుతానికి ఈ పిల్లి ఆరోగ్యం కుదురు గానే ఉన్నా, పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని అంటున్నారు వైద్యులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube