వైరల్ వీడియో: గిన్నిస్ రికార్డు.. నీటిలో 3 నిమిషాల్లో 30 మ్యాజిక్స్..!

కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఎన్నోసార్లు రుజువైన సంగతి తెలిసిందే.మనలో చాలా మంది తమకు ఉన్న స్పెషల్ టాలెంట్ చూపించడానికి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తూ ఉంటారు.

 Viral Video Guinness Record 30 Magics In 3 Minutes In Water,30 Magics In 3 Minut-TeluguStop.com

ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా చేస్తే అందరి మన్నలను పొందగలరు.ప్రస్తుతం ఇటువంటి కోవకే చెందిన వ్యక్తిగా ఇంగ్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ మెజీషియన్ మార్టిన్ చేరాడు.

మామూలుగా మెజీషియన్ మ్యాజిక్ లు స్టేజీపైనే చేయడం మనం చూస్తూ ఉంటాము.కాకపోతే, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈయన మాత్రం తాజాగా నీటి అడుగున మ్యాజిక్ ప్రదర్శనలు చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు.

బ్రిటన్ లోని ఫోర్డ్ షేర్ చెందిన మార్టిన్ అనే మెజీషియన్ నీటి కొలనులో అడుగున ఆక్సిజన్ మాస్క్, అలాగే కళ్ళజోడు ధరించి దాదాపు మూడు నిమిషాల్లో 30 కి పైగా మ్యాజిక్ ట్రిక్స్ ను ప్రదర్శించి ఔరా అనిపించాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది.ఈ వీడియోను చూసి మేజిషన్ ను అభినందనలతో ముంచెత్తారు.

అయితే ఈ మేజిషన్ ఇలా సాధించడానికి ఎంతో కఠోర శ్రమ పడ్డాడు.నీటి లోపల మ్యాజిక్ ప్రదర్శన ఇవ్వడానికి ఆయన ఓ ఛాలెంజ్ గా స్వీకరించారు.

ఈయన కేవలం మెజీషియనే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.హాస్పిటల్ లో ఉన్న పిల్లల కోసం ఈయన ‘స్ప్రెడ్ ఏ స్మైల్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అనేక ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆయన వారి కుటుంబ సభ్యులకు, అలాగే స్ప్రెడ్ ఏ స్మైల్ సంస్థకు చెందిన పిల్లలు కు అంకితం చేశాడు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube