వైరల్.. వరుడిని కడిగి పారేస్తున్న నెటిజెన్స్.. ఎందుకంటే ?

పెళ్లి అనగానే అమ్మాయిలకు చాలా ఆశలు ఉంటాయి.భర్తగా వచ్చే వాడు ఇలా ఉండాలి.

 Viral Video Groom Misbehaves With Bride-TeluguStop.com

అలా ఉండాలి అని అవేవో కోరికలు ఉంటాయి.కానీ వీటన్నిటి కంటే ముందు భయంగా ఉంటుంది.

కొత్త వ్యక్తితో జీవితం ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు.పెళ్లి అవగానే కొత్త ఇంటికి వెళ్ళాలి అక్కడ మనుషులు ఎలా ఉంటారో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అని ఆలోచిస్తూ భయపడతారు.

 Viral Video Groom Misbehaves With Bride-వైరల్.. వరుడిని కడిగి పారేస్తున్న నెటిజెన్స్.. ఎందుకంటే -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంచి వాళ్ళు అయితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో.మంచి వాళ్ళు కాకపోతే అంత దుర్భరంగా మారుతుంది.అలా అలా చిన్న గొడవలు అయ్యి ఆ తరువాత అవే గొడవలు విడాకుల వరకు వెళ్తాయి.ప్రేమ లేని చోట బంధం ఎక్కువ కాలం నిలవదు.

పెళ్లి అనేది ఇష్టపూర్వకంగా చేసుకోవాలి.లేకపోతే సమస్యలు మొదలవుతాయి.

తాజాగా ఒక వరుడు చేసిన పనికి నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.

పెళ్లి జరుగుతున్నా సమయం లోనే ఇలాంటి పని చేసి అందరి చేత తిట్లు తింటున్నాడు ఒక వరుడు.

ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడని ఈ వీడియో చుస్తే ఎవ్వరైనా ఈజీగా చెప్పేస్తారు.అందుకే ఈ వీడియో చుసిన నెటిజెన్స్ అతడిని తిట్టడంతో పాటు ఇలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ ఆ వరుడు ఎలాంటి పని చేశాడా అని అనుకుంటున్నారా.

ఈ వీడియోలో పెళ్లి జరుగుతూ ఉండగా వరమాల కార్యక్రమం స్టార్ట్ అయ్యింది.వధూవరులు ఇద్దరూ ఒకరి మెడలో ఒకరు పూల మాల వెయ్యాల్సి ఉండగా పెళ్లి కూతురు వరమాల వేసింది.ఆ తర్వాత పెళ్లి కొడుకు వంతు వచ్చింది.

అయితే వరుడు వధువు మెడలో దండ ను నెమ్మదిగా వేయకుండా విసిరి వేసాడు.అది వధువు కాళ్ళ దగ్గర పడింది.

ఆ తర్వాత కూడా ఆ వరమాల వేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు.పెళ్లి కూతురు ఏం చేయలేక ఇదంతా నిలబడి చూస్తూ ఉంది.

ఈ వీడియో చూసిన నెటిజెన్స్ వరుడిని తిట్టి పడేస్తున్నారు.

https://www.instagram.com/reel/CRV8ZJkFsUU/?utm_source=ig_embed&ig_rid=6d327d41-80f7-4d98-be9d-21d9a77e5b77
#Social Media #Bride #Viral Video #ViralVideo #Groom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు