సాధారణంగా కొంతమంది ఇంట్లో చాలా సైలెంట్ గా ఉన్న కానీ, బయట మాత్రం వీరంగం సృష్టిస్తూ ఉండడం సహజం.బయట ఎలా ఉన్నా కానీ.
ఇంట్లో మాత్రం బాస్ భార్య అని అందరూ అంటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.ఇందులో ఎటువంటి సందేహం లేదు.
కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పులు చేసే, భార్యలు సరి చేస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు.ఇలాంటి తరుణంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
ఒక ముసలాయన ఇంట్లో పని మానేసి వీధులలో చిందులు వేస్తూ ఉండడం చూసి అక్కడి నుంచి పరుగులు పెట్టించింది ఒక బామ్మ.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా, ఆ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ మాత్రం నవ్వు ఆపుకోలేకపోతున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా.?! ఒక ముసలాయన డీజే సౌండ్ లకు డాన్స్ వేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.అతడి పక్కన ఉన్న యూత్ చాలా నెమ్మదిగా డాన్స్ వేస్తూ ఉంటే.
ఆ ముసలాయన మాత్రం చాలా జోషితో డాన్స్ తో చిందులు వేస్తున్నాడు.
ఇంతలోనే అనుకోకుండా ఆ ముసలాయన భార్య అక్కడికి వచ్చింది.అది కూడా కర్ర పట్టుకొని ఏమిటి డాన్స్ వేస్తావ్.కర్రతో ఒకటి ఇవ్వన అని అనే సరికి ఆ ముసలాయన అక్కడ నుంచి పరుగులు పెట్టాడు.
ఇక ఈ వీడియో వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ “వయస్సు అనేది తాత్కాలికమే కానీ భార్య కర్ర శాశ్వతం” అనే క్యాప్షన్ ని జత చేశాడు.ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ పెడుతున్నారు.