వైరల్ వీడియో: పోలీసు జాగిలం కి అదిరిపోయే స్వాగతం..!

అమెరికా దేశంలోని కే9 పోలీస్ డాగ్ కి అక్కడి పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు.బుల్లెట్ గాయాల కారణం ఈ పోలీస్ డాగ్ వారం రోజుల క్రితం ఆస్పత్రి పాలయింది.

 Viral Video Grand Welcome To K9 Dogs Inus, Us Police, Welcomed, K9-dog, Viral Vi-TeluguStop.com

అయితే సర్జరీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లిపోతున్న ఆర్లో అనే ఈ పోలీసు శునకానికి తుర్​స్టన్​ కౌంటీ షెర్రిఫ్​​ పోలీసు శాఖ వారు అరుదైన గౌరవం ఇవ్వగా.దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

షెర్రిఫ్​​ పోలీసు శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.జనవరి 13వ తేదీన పోలీస్ అధికారులు మరణాయుధాలు కలిగిన ఒక డ్రైవర్ ని వెంబడించారు.అయితే ఈ సుధీర్ఘమైన పోలీస్ చేజ్ ఒక ప్రాంతంలో ఆగిపోగా.వెంటనే పోలీసులు, డ్రైవర్ గన్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు.

ఈ సందర్భంలోనే డ్రైవర్ తో సహా పోలీసులతో పాటు వచ్చిన ఆర్లో శునకానికి బుల్లెట్స్ తగిలాయి.ఆర్లో కుక్కకి భుజంలో ఒక బుల్లెట్.వెన్నుముక కి దగ్గర లో మరొక బుల్లెట్ తగిలింది.దీనితో పోలీసులు ఆ కుక్కను వెంటనే స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రి వైద్యులు కుక్కకి సర్జరీ చేసి రెండు బుల్లెట్లను బయటకు తీశారు.అనంతరం కొన్ని రోజుల పాటు ఆ కుక్కని ఆసుపత్రిలోనే ఉంచి దానికి బలం వచ్చేంతవరకు మందులిచ్చి, పోషక పదార్థాలను తినిపించారు.

ఆ తర్వాత డిశ్చార్జి చేశారు.ఐతే పోలీస్ ఎస్కార్ట్స్ వచ్చి ఆర్లో శునకానికి ఘన స్వాగతం పలుకుతూ దాని యజమాని ఇంటికి సాగనంపారు.

అలాగే ఈ కుక్క పూర్తిస్థాయిలో ఆరోగ్యం కుదుటపడేంత వరకు పోలీస్ శాఖ వారు సేవలు చేయనున్నారు.

అయితే షెర్రిఫ్​​ పోలీసులు వెల్ కమ్ హోమ్ అనే పెద్ద బోర్డు పెట్టి.

చప్పట్లు కొడుతూ అతి జాగ్రత్తగా కే9 కుక్కని ఇంటికి తీసుకెళ్లడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.రెండు బుల్లెట్ల గాయాలపాలైన ఈ కుక్కకి ఇక రిటైర్మెంట్ ప్రకటించి విశ్రాంతి ఇవ్వాలని మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube