వైరల్ వీడియో: తన తల్లి మనసును చాటుకున్న గొరిల్లా..!

ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన ఆలోచనలు వారి తల్లికి ఇట్టే తెలిసి పోతాయి అంటారు.నిజానికి ఈ విషయంలో కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఫాలో అయిపోతాయి.

 Viral Video Gorilla Playing With Baby In Franklin Park-TeluguStop.com

పిల్లలు చెప్పే హావభావాలను పసికట్టి ముందుగా వారికి ఏం కావాలో తెలుసుకునేది కేవలం తల్లి మాత్రమే.సృష్టిలో ఎవరైనా సరే అనుసరించదగ్గ అతి ముఖ్యమైన వారు ఎవరు అని అంటే మొదట నిలబడేది తల్లి మాత్రమే.

చిన్నప్పటి నుంచే తల్లికి తన సొంత పిల్లలపై ఉన్న ప్రేమ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా మనుషుల కంటే ఈ విషయంలో జంతువుల్లో ఎక్కువ అని చెప్పవచ్చు.

 Viral Video Gorilla Playing With Baby In Franklin Park-వైరల్ వీడియో: తన తల్లి మనసును చాటుకున్న గొరిల్లా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అసలు విషయానికి వస్తే.

తాజాగా ఒక జూలో ఓ మహిళ తన పసి బిడ్డను తీసుకురాగా ఆ బిడ్డను చూసిన గొరిల్లా బిడ్డతో ఆడిన తీరు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.అమెరికా దేశంలోని బోస్టన్ నగరంలో ఉన్న ఫ్రాంక్లిన్ పార్క్ లో ఈ విచిత్ర సంఘటన కనువిందు చేసింది.

కేవలం మూడు నెలలు ఉన్న పసిబిడ్డను జూ కి ఓ జంట తీసుకువెళ్ళింది.ఆ జంతు ప్రదర్శనశాలలో ఓ గ్లాస్ ఎగ్జిబిషన్ లో గొరిల్లా ఉంది.గొరిల్లా ఉన్న గ్లాస్ ఎగ్జిబిషన్ దగ్గరికి ఆ జంట వారి పిల్లాడిని తీసుకువెళ్లగా గొరిల్లా వెంటనే ఆ గ్లాస్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది.అలా వచ్చిన గొరిల్లా ఆ పిల్లాడిని చూస్తూ అలాగే ఉండిపోయింది.

ఇదంతా గమనించిన ఆ పిల్లాడి తల్లి ఆ గ్లాస్ వద్దకు చేరుకొని పిల్లాడిని గొరిల్లా కు చూపిస్తుంది.ఈ సమయంలో గొరిల్లా ఆ పిల్లాడిని చూస్తూ వారికి అడ్డుగా ఉన్న గ్లాస్ పై చేయి పెట్టి పసిబిడ్డకు ముద్దిస్తూ అచ్చం తల్లి దీవెన అందించేలా చేతిని ఉంచింది.

ఇలా ఉన్న సమయంలోనే ఆ బిడ్డ తల పై చేయి పెట్టేందుకు గొరిల్లా ప్రయత్నించగా అడ్డుగా గ్లాస్ ఉండటంతో ఆ తల్లి గొరిల్లా తీవ్ర నిరాశ చెందింది.చంటి బిడ్డ ఎవరికైనా చంటి బిడ్డనే కదా.అందుకే కాబోలు జంతువుగా పరిగణించే గొరిల్లా కూడా మనిషి రూపంలో ఉన్న చంటి బిడ్డను ఆశీర్వదించడానికి ప్రయత్నించింది కాబోలు.ఈ సందర్భంతో కేవలం మనుషులకు మాత్రమే ఫీలింగ్స్ ఉండడమే కాదని.

జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని గొరిల్లా నిరూపించింది.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది.

నెటిజెన్స్ ఈ వీడియోకు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

#Boston #PlayingWith #Animals #Human Beings #Muziam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు