వైరల్ వీడియో: ఇలాంటి టాలెంట్ ను ఎవరైనా చూశారా..?  

Girl Writing With Two hands Avadhana Kala, social medai, viral video, writing, two hands, black board, Incredible India - Telugu Black Board, Girl Writing With Two Hands Avadhana Kala, Incredible India, Social Medai, Two Hands, Viral Video, Writing

మనలో చాలా మందికి ఎక్కువ శాతం కుడి చేతితో వ్రాసే అలవాటు ఉంటుంది.చాలా కొద్ది మంది మాత్రమే వందకు ఒక్కరో, ఇద్దరో ఎడమ చేతితో వ్రాసే అలవాటు ఉన్నవారు ఉంటారు.

TeluguStop.com - Viral Video Girl Two Hands Writing Avadhanakala

అంతే కాదండి మరి కొంతమంది రెండు చేతులతో రాయగలిగే వారు కూడా కలిగి ఉంటారు.అయితే ఓకే సమయంలో రెండు చేతులతో వివిధ టాపిక్స్ రాయడం అనేది చాలా అరుదు.

రెండు చేతులతో ఒక చేయి ముందు ఒక చెయ్యి వెనక్కి అలాగే ఒక చేత్తో పైన మరో చేత్తో కింద ఇలా రాసేవారిని మీరు ఎక్కడైనా చూశారా…? ఖచ్చితంగా లేదనే సమాధానమే వస్తుంది.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలా చేసిన ఓ అమ్మాయి కి సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ గా మారింది.

TeluguStop.com - వైరల్ వీడియో: ఇలాంటి టాలెంట్ ను ఎవరైనా చూశారా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే…

తాజాగా ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఆ వీడియోను చూసిన వారందరూ సూపర్ టాలెంట్ అంటూ పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి బహుళ ఏకాగ్రత కలిగిన ఈ కళ ను అవధాన కళ అని పిలుస్తారు అన్నట్టు కొందరు తెలుపుతున్నారు.ఈ వీడియోలో ఉన్న ఓ అమ్మాయి బోర్డు పైన తన రెండు చేతులతో ఒకే సమయంలో రాసి అబ్బురపరుస్తుంది.

పై నుంచి కిందకు రాయడం, అలాగే ముందు నుంచి వెనక్కి ఇలా తన డిఫరెంట్ స్టైల్స్ రాయడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు.తన రెండు చేతులతో ఎలా రాస్తున్నా ఆలోచించే లోపలే తను రాయాలనుకునేది అలా రాసేయడంతో అందరిని ఆ అమ్మాయి అబ్బురపరుస్తుంది.

ఈ వీడియోకు సదరు ట్విట్టర్ యూజర్ భారతదేశంలోని ప్రముఖులను టాగ్ చేశారు.

ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న కార్యక్రమం ఇంక్రెడిబుల్ ఇండియా పేరుతో ఈ వీడియోని షేర్ చేస్తూ అందుకుగాను హర్భజన్ సింగ్, అమితాబచ్చన్, రంగనాథం, ఆనంద్ మహీంద్రా, అనుపమ్ ఖేర్, రణదీప్ హూడా, సురేష్ రైనా, అమీర్ ఖాన్, డాక్టర్ కుమార్ విశ్వాస్, శ్వేత సింగ్ లాంటి ప్రముఖులను ఈ వీడియోకు టాగ్ చేయడం జరిగింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.నిజంగా ఆ వీడియోలో ఉన్న అమ్మాయి టాలెంట్ చూస్తే మీరు కూడా వావ్ అనకుండా ఉండలేరు మరి.

#GirlWriting #Black Board #Writing #Viral Video #Social Medai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Girl Two Hands Writing Avadhanakala Related Telugu News,Photos/Pics,Images..