పాపం పాప: ఆ చేపకు ఆహారం తినిపించడానికి నానా యాతన పడుతోంది, కావాలంటే చూడండి!

మనలో కొంతమందికి వివిధ ప్రాణులంటే ఎంతో ప్రేమ ఉంటుంది.అందులో కొందరు చేపలకు ఆహారం తినిపించడంలో చాలా ఆనందాన్ని పొందుతారు.

 Viral Video Girl Struggling To Feed The Tarpon Fish Details, Fish, Mouth , Viral-TeluguStop.com

చేపల్లో అనేక రకాలు.చిన్న చేపలనుండి పెద్ద పెద్ద చేపలవరకు మనం చూశాం.

వాటిల్లో సముద్రంలో లోతుల్లో నివసించే ఈ చేపలు చాలా పెద్దవిగా ఉంటాయి.వాటిలో తిమింగలం, సొర చేపలు చూడటానికి ఒకింగా భయంకరంగా ఉంటాయి.

ఈ చేపలకు చిక్కిన ఏదైనా ఆహారం అవ్వాల్సిందే, ఆఖరికి మనిషి కూడా.అందుకే ఈ ప్రమాదకరమైన చేపలకు మనుషులు చాలా దూరంగా వుంటారు.

ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనవి కనుక.మనుషులపై షార్క్ దాడి చేయడం గురించి తరచుగా వార్తలు మనం చూస్తూనే ఉంటాం.

అయితే, తాజాగా అలాంటి చేప గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.అవును… ఆ చేప అట్లాంటిక్ టార్పాన్. ఇది చాలా భారీగా ఉంటుంది.ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇది చూస్తే మీరు ఖచ్చితంగా నివ్వెరపోవాల్సిందే.మనలో ఎంతోమందికి సరదాగా ఏదో ఒక సమయంలో చేపలకు మేత తినిపించాలానే కోరిక కలుగుతుంది.

ఇంట్లో పెంచే చిన్న చిన్న చేపలకు ఆహారం ఎవరైనా తినిపించేస్తారు.కానీ టార్పాన్ వంటి చేపలకు ఆహారం తినిపించడం అంటే మామ్మూలు విషయం కాదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువతి నీటిలో తేలియాడే వల మీద పడుకొని, వల లోపలకు చేయి పెట్టి.టార్పాన్ చేపకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది చూడండి.

అయితే, ఇక్కడే ఓ గమ్మత్తు జరిగింది.గమ్మత్తు అనేకంటే ప్రమాదం అని చెబితే బావుంటుందేమో.అవును.ఆ యువతి ఆహారం ఇచ్చే లోపు టార్పాన్ చేప ఆమె చేతిని సైతం నోటితో పట్టుకుంది.ఇక అంతా జరిగే లోపే ఒక్కసారిగా హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నంత పని అయింది ఆ యువతికి.ఆమె అదృష్టం ఏమిటంటే, ఆ చేప ఆమె చేతిని తరువాత విడిచిపెట్టింది.

టార్పన్ చేప ప్లేస్ లో ఏ సొరచేప ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ యువతి తన చేతిని కోల్పోయి ఉండేది.అది టార్ఫాన్ చేప కనుక సురక్షితంగా బయటపడింది.

ఆ భయానక దృశ్యాన్ని మీరు కూడా చూసేయండి మరి!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube