వైరల్ వీడియో: వామ్మో దయ్యం.. ఆ ఇంట్లో ఎవరూలేరనీ వెళితే చివరకు..?!

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనేది ఎవరికీ అంతుచిక్కని ఒక మిస్టరీ.దేవుడు ఉన్నప్పుడు దెయ్యాలు ఎందుకు ఉండవని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు కానీ వారి దగ్గరకు కూడా ఖచ్చితమైన సమాధానం దొరకదు.

 Viral Video Ghost Caught At Abandoned Care Home ,  Ghost, Viral News, Viral Late-TeluguStop.com

ఇక శాస్త్రవేత్తలు దెయ్యాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని.అవి అంతా ఒట్టి ట్రాష్ అని కొట్టిపారేస్తున్నారు.

అయితే కొందరు మాత్రం దెయ్యాలు ఈ సృష్టిలో ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఎంతో సమయం వెచ్చిస్తున్నారు.మరికొందరు దెయ్యాలను చూడాలన్న కుతూహలంతో పాడుబడ్డ ఆస్పత్రులు, భవనాలు.

నిర్మానుష్యమైన స్మశానాలు ఇలా చెప్పుకుంటూ పోతే జనారణ్యం లేని అనేక ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు.

అయితే కొందరు వ్యక్తులు తాము నిజంగానే దెయ్యాలను చూశామని.

కావాలంటే తాము రికార్డ్ చేసిన వీడియోలను చూడండి అంటూ నెట్టింట ఎన్నో ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు.అయితే ఆ వీడియోలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

కానీ కొందరు మాత్రం ఈ వీడియోలు ఎడిట్ చేసినవని.పాపులారిటీ లేదా డబ్బు కోసం ఇలా ఫేక్ స్టంట్లు చేస్తున్నారని.

ఇందులో ఏ మాత్రం నిజం లేదని చెబుతుంటారు.కానీ దెయ్యాలు ఉన్నాయని ఎంతోమంది వీడియోలు పోస్ట్ చేసి మరీ చెబుతున్నారు.

విశేషమేంటంటే ఆ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.తాజాగా మరో కొత్త వీడియో నెట్టింట ప్రత్యక్షమయ్యింది.

ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోలో ఏం కనిపించిందో మాట్లాడుకుంటే.ఇద్దరు వ్యక్తులు ఫ్లాష్ లైట్ లు, కెమెరాలు పట్టుకుని పాడుబడ్డ ఒక కేర్ హోమ్ లోపలికి వెళ్లారు.పై అంతస్తుకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉండగా వారికి ఒక నల్లటి నీడ కనిపించింది.

దీంతో వారు ఒక్కసారిగా స్టన్నయిపోయారు.తర్వాత తేరుకుని హలో అని ఆ వికృత నీడతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

కానీ ఆ నీడ కొద్ది సెకన్ల పాటు అక్కడక్కడే తచ్చాడి.ఆ తర్వాత మాయమైపోయింది.

దీంతో ఈ ఇద్దరు గోస్ట్ హంటర్స్ ఆ వికృత ఆకారాన్ని వెంబడిస్తూ పైకి వెళ్లారు.ఆ పురాతన భవనంలోని పై అంతస్తుకి చకచకా చేరుకున్నప్పటికీ.

ఆ మిస్టీరియస్ ఫిగర్ మాత్రం జాడ లేకుండా అదృశ్యమయింది.అయితే ఈ ఘోస్ట్ వీడియోని ప్రముఖ బ్రిటిష్ వార్తా పత్రిక “ది సన్” ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

కాగా ఈ వీడియోకి ఇప్పటికే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube