వైరల్ వీడియో: బైక్ పై ఇలా కూడా ప్రయాణిస్తారా..?!

ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన అందరికీ నిమిషాలలో ఇట్లే తెలిసిపోతుంది.ఇందులో భాగంగానే కొన్ని వార్తలు.

 Viral Video Funny Bike Riding Goes Viral In Social Media-TeluguStop.com

అలాగే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో కొన్ని వీడియోలు మనకి ఆలోచించే విధంగా ఉంటే మరికొన్ని కేవలం ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి.

మరికొన్ని పక్కదారి పట్టిస్తే మరికొన్ని ఏడిపించేలా కూడా ఉంటాయి.అయితే ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తుంది.

 Viral Video Funny Bike Riding Goes Viral In Social Media-వైరల్ వీడియో: బైక్ పై ఇలా కూడా ప్రయాణిస్తారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు కారణం ఈ వీడియోను చూసిన మొదటి వారందరూ మొదట ఆశ్చర్యపోయిన ఆ తర్వాత మాత్రం తెగ నవ్వుకుంటున్నారు.ఇక ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ బైక్ పై నలుగురు ప్రయాణిస్తున్నారు.అయితే అందులో విచిత్రం ఏమి అని అనుకుంటున్నారా.?! అక్కడే ఉంది అసలైన విషయం.బండి తోలుతున్న వ్యక్తి ముందుగా కూర్చొని ఉండి ఆ తరువాత మరో ఇద్దరు బైక్ పై వెళ్తున్న వ్యక్తి వెనకాల కూర్చొని ఉన్నారు.

అయితే ఆ నాలుగో వ్యక్తి ప్రయాణిస్తున్న విధానమే అందరిని నవ్వించేలా చేస్తుంది.అతడు నిటారుగా ఉండి గాల్లో తేలుతున్నట్టుగా ఒక సైడ్ కి ఉన్నాడు.అలా ఉన్న అతన్ని బైక్ పై ప్రయాణిస్తున్న వెనుక కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఏ మాత్రం పట్టు విడవకుండా గట్టిగా పట్టుకున్నారు.దీంతో అతడు అచ్చం సూపర్ మాన్ లా గాల్లో తేలినట్లు బైక్ పై దూసుకెళ్తున్నాడు.

ఓకే బైక్ పై అంతమంది కూర్చోవడానికి స్థలం లేకపోతే ఇలా చేశారని చాలా మంది భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ వీడియోపై నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న కరోనా కాలంలో ఇలాంటి సాహసాలు అవసరమా అంటూ కొందరు వారిని చూస్తుంటే మరికొందరు మీ ఆలోచన సూపర్ అంటూ వారిని పొగిడేస్తున్నారు.మరికొందరు ఇలాంటివి కేవలం భారత్లోనే ఎక్కువగా కనిపిస్తాయని కామెంట్ చేస్తున్నారు.

#Bike #Five Members #Social Meida #Viral Video #Riding

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు