వైరల్ వీడియో: క్రేజీగా ఆటోల రేసింగ్..!

బైక్ రేసులు, కార్లు రేసులను చాలామంది ఎంతో ఇష్టపడతారు.ఆ రేసులలో వాళ్ళు వెళ్లే స్పీడ్ చూస్తుంటే షాక్ అవుతాము కదా.

 Viral Video Fully Crazy Auto Racing, Auto Race, Racing, Social Media, Viral Vide-TeluguStop.com

అయితే ఇప్పటిదాకా మనం బైక్​లు, కార్ల రేసులు, ఎద్దులు, గుర్రాల పోటీల గురించి మాత్రమే విన్నాము.కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే షాక్ అవుతారు.

అదేంటంటే బైక్, కార్ రేసులను తలపించేలా ఆటో రేస్ లు కూడా జరుగుతాయన్న విషయం మీకు తెలుసా.? అవునండి మీరు విన్నది నిజమే.ఈ పోరగాళ్ళు ఆటోలు నడిపిన తీరు చూస్తే వావ్ అనాలిసిందే.రాయి, రప్ప, నీరు, గుంటలు అనే తేడా లేకుండా లక్షాన్ని చేరుకోవడానికి ముందుకు వేగంతో ఆటో రేసులో పాల్గొన్నారు.

ఎన్నో విన్యాసాలు, ఉత్కంఠతో ఈ రేసు భీకరంగా సాగింది.

అసలు వివరాలలోకి వెళితే… ‘దేశీ వర్షన్​ ఆఫ్​ ఫార్ములావన్ రేస్‘ అంటూ సునీత నహర్ తన ట్విట్టర్​ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఈ ఆటోల రేసు మాత్రం చూస్తుంటే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడుచుకుంటాయి.ఒకపక్క మట్టి రోడ్లు, మరో పక్క ఎత్తు పల్లాలను దాటిస్తూ ఆటో డ్రైవర్లు దుమ్మలేపారు.

అయితే ఈ ఆటో రేస్ ఈ రేసు భారత్​ లో జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.కాకపోతే ఇది జరిగింది మాత్రం ఇండియా కాదు.

శ్రీలంకలో జరిగిందని తాజాగా నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.‘ఇండియా వర్షన్ ఆఫ్ ఫార్ములావన్ రేస్’ అని కాప్షన్ రాసుకొచ్చారు.అయితే, చాలా మంది భారత్​లోనే ఈ రేసు జరిగిందని నమ్మేశారు.

ఇంకేముంది కామెంట్ల మీద కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ మొదలెట్టేసాడు.తీరా ఇది ఎక్కడిదని ఆరా తీస్తే.

ఈ రేస్ జరిగింది శ్రీలంకలో అని తేలింది.ఎక్కడియితే ఏమి ఆటో రేస్ చూస్తుంటే మాత్రం భలే థ్రిల్లింగ్ గా ఉన్నదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube