వైరల్ వీడియో: దుకాణదారుడు ప్రజల్ని ఎంత తెలివిగా బురిడీ కొట్టిస్తున్నాడంటే..?!

లాక్‌డౌన్‌తో చిరు వ్యాపారులు గడ్డు కాలాన్నే ఎదుర్కొంటున్నారు.కొన్ని రోజులుగా వ్యాపారాలు లేక వారు ఇళ్లకే పరిమితం కావడమే ఇందుకు ప్రధాన కారణం.

 Viral Video Fruits Seller Cunning Idea Cheating Customers-TeluguStop.com

దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది చిరు వ్యాపారులు ఉన్నారు.వీరంతా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.

కరోనాతో లాక్‌ డౌన్‌ కారణంగా ఫుట్‌పాత్‌ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు సాగక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.రోజూ వ్యాపారాలు సాగితేనే తాము వివిధ బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తీసుకున్న డబ్బులు చెల్లించలేక అవస్థలు పడే స్థితి నెలకొంది.

 Viral Video Fruits Seller Cunning Idea Cheating Customers-వైరల్ వీడియో: దుకాణదారుడు ప్రజల్ని ఎంత తెలివిగా బురిడీ కొట్టిస్తున్నాడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమ వ్యాపారం సాగక చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వీడియోలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.అతడి దగ్గరికి వచ్చిన కస్టమర్లను చాలా తెలివిగా మోసం చేస్తున్నారు.

ఇది ఓ వ్యక్తి వీడియో తీసి పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఏ వినియోగదారుడు అయినా సరే తాజా పండ్లు, కూరగాయలే తీసుకుంటారు.

నచ్చిన వాటినే ఎరుకుని తూకం వేయించుకుంటారు.కానీ, అక్కడే దుకాణదారులు ప్రజల్ని ఎంతో తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు.

ఇక్కడో కస్టమర్‌ కూడా అలాగే, తనకు నచ్చిన మామిడి పండ్లను తీసుకుని తూకం వేయించుకునేందుకు ఇస్తున్నాడు.కానీ, ఆ పండ్ల బండి వ్యాపారి మాత్రం.అతడు ఏరుకున్న పండ్లను పక్కన పెట్టి మరో నాసిరకం పండ్లను కొనుగోలుదారుకు కట్టబెట్టాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తెలివైన ఈ దుకాణదారుడు.వినియోగదారులను మోసం చేస్తున్న విధానం చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

#Comments #Mangoes Seller #Social Media #Customer #Cheating

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు