వీడియో వైరల్: సైకిల్‌ పై 30 నిమిషాల్లో 33 అంతస్తులు ఎక్కిన సైక్లిస్ట్..!

అపార్ట్‌మెంట్ ల, ఆఫీసు లలో లిఫ్ట్ పనిచేయకపోతే రెండు, మూడు ఫ్లోర్లు ఎక్కడానికి కూడా చాలా మంది కష్టపడుతుంటారు.కానీ ఈ ఫ్రైంచ్‌ సైక్లిస్ట్‌ చేసిన పని చూసి అందరు నోటా వావ్ అనేలా చేశాడు.

 Cyclist Climbs 33 Floors, 768 Steps In Just 30 Mins, French Cyclist , Aurelien F-TeluguStop.com

అయితే ఇంతకీ ఫ్రైంచ్‌ సైక్లిస్ట్‌ చేసిన పని ఏంటి.? అతడు ఏం చేశాడని అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు అని అనుకుంటున్నారా.? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆరీలియన్ అనే సైక్లిస్ట్, మౌంటైన్ బైకర్ సైకిల్‌ పై 33 ఫ్లోర్లు ఎక్కేశాడు.33 అంతస్తులను సైకిల్‌ పై అవలీలగా కేవలం అరగంటలోనే చేరుకున్నాడు.సైక్లిస్ట్‌, మౌంటెన్‌ బైకర్‌ అరిలిన్‌ ఫాంటెనయ్‌ ట్రినిటీ టవర్‌లో 33 అంతస్తుల్లోని 768 మెట్లను కాలిను కిందపెట్టకుండా సైకిల్‌ పైనే ఎక్కాడు.

33వ ఫ్లోర్‌ కు చేరుకున్న అనంతరం కాళ్లు కింద పెట్టేయడంతో అక్కడితో ఆపేసి తన సైకిల్‌ను భూజాలపై పెట్టుకుని కిందకు వచ్చేశాడు.పుటిక్స్‌ లో కొత్తగా ప్రారంభమైన ఆకాశహార్మ్యం ట్రినిటీ టవర్ అరిలిన్‌ అసాధారణ టాస్క్‌ కు వేదికగా నిలిచింది.ఇక ప్రస్తుతం అరిలిన్‌ 33 అంతస్తులను సైకిల్‌ పై చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

తాము లిఫ్ట్ లేకుండా 30 ఫ్లోర్లు మెట్లు ఎక్కమంటేనే భయపడతామని, అరిలిన్‌ ఏకంగా సైకిల్‌ పై వెళ్లడం నిజంగా రికార్డ్ అనే చెప్పాలంటూ కొనియాడుతున్నారు.

ఇక ఈ వీడియో చుసిన నెటిజన్లు అరిలిన్ ఫీట్ పై తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అరిలీన్ ఈ ఫీట్ ను ఓ మంచి పని కోసం చేశాడు.పిల్లల ఛారిటీ కోసం అరిలీన్ ఈ ఫీట్ చేశాడు.

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు ఈ ఫీట్ ద్వారా వచ్చే డబ్బును ఉపయోగించనున్నారు.మొత్తానికి మనోడు చేసిన పనికి వారెవ్వా అనాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube