వైరల్ వీడియో: సముద్ర భూభాగం నుండి మంటలు ఎప్పుడైనా చూశారా..?!

సాధారణంగా ఓ చోట అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్లు వచ్చి ఆ మంటలను ఆర్పి వేస్తాయి.అలాగే అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఫైర్ ఇంజిన్ సిబ్బంది తమ విధులను నిర్వహిస్తారు.

 Viral Video Fire Accident Near Mexico Sea Due To Pipeline Gas Leak , Viral Video-TeluguStop.com

అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వేసవి కాలంలో జరుగుతుంటాయి.అలాగే ఆ టైంలో అడవులు కాలిపోవడం జరుగుతుంది.

అగ్ని మాపక సిబ్బంది తమ ఇంజిన్లలో నీటిని నింపుకుని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపు చేస్తారు.ఇటువంటి ఎన్నో అగ్ని ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి.

తాజాాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.ఆ వీడియోను మీరు చూస్తే కనుక ఆశ్చర్యపోతారు.

అవును నిజం.అగ్ని ప్రమాదం జరిగింది ఓ అపార్టు మెంటులోనో, ఓ గ్రామంలోనో లేకుంటే ఓ పార్కులోనో కాదు.

సముద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం.

సముద్రంలో మంటలు వ్యాపించాయి.సముద్రపు నీటిలో మంటలు అనేవి చెలరేగాయి.

నడి సముద్రంలోని ఆ మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

మెక్సికో సమీపంలో ఉన్నటువంటి మహాసముద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది.

ఆ ప్రాంతంలో అగ్ని మంటలు నారింజ రంగులో ఎగసిపడ్డాయి.ఆ మంటలు వృత్తాకారంలో చెలరేగడం మనం వీడియోలో చూడొచ్చు.

సముద్రంలో ఉండే ఆ మంటలను ఆర్పి వేయడానికి ఫైర్ ఇంజిన్లు వచ్చాయి.పశ్చిమ దిశగా ఉండేటటువంటి సముద్రపు ఉపరితలంపై అగ్ని ప్రమాదం జరిగింది.

Telugu Mexico Sea, Latest-Latest News - Telugu

ఆ సమయంలో మంటలు చెలరేగాయని ఆ రాష్ట్ర చుమురు సంస్థ పెమెక్స్ తెలియజేసింది.సముద్రపు నీటి అడుగులో ఉన్నటువంటి పైపులైన్ నుంచి గ్యాస్ అనేది లీక్ అయ్యింది.దీంతో ఈ అగ్ని ప్రమాదం అనేది జరిగిందని తెలుస్తోంది.మంటలను ఆర్పడానికి ఐదు గంటల సమయం పట్టింది.10.30గంటలకు మంటలను పూర్తిగా ఆపేశారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలను అతి పెద్ద ముడి చమురు సంస్థ పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube