వైరల్ వీడియో: రెండు పులుల మధ్య భీకర పోరాటం..!- Viral Video Fierce Fight Between Two Tigers

Brutal Fight Between Two Tigers, Viral Video, Two Tigers, Fight Between Tigers, Social Media - Telugu Social Media, Two Tigers Fight, Viral Latest, Viral News, Viral Video

మనం అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటాము.అప్పుడప్పుడు ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

 Viral Video Fierce Fight Between Two Tigers-TeluguStop.com

కొన్ని సార్లు బద్ధ శత్రువులు కూడా అప్పుడప్పుడు స్నేహంగా కలిసిపోయి ఉండటం చాల చూశాము.అయితే మీరు ఎప్పుడైనా రెండు పులులు కొట్టుకోవడం చూశారా.? పులులు ఒకే జాతికి చెందినవి కదా.అవి ఎందుకు కొట్టుకుంటాయని ఆశ్చర్యపోతున్నారా.? ఇది నిజం అండి.

ఇక అరుదైన సందర్భాల్లో మాత్రమే పులులు కొట్టుకుంటాయి.

 Viral Video Fierce Fight Between Two Tigers-వైరల్ వీడియో: రెండు పులుల మధ్య భీకర పోరాటం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పోరాటాన్ని కళ్లారా చూస్తే మాత్రం మనకు ఒళ్లు జలదరిస్తుంది.వాటి గర్జనలు, పంజా దెబ్బలు, ఉరికే జోరు.

అన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.ఇది సంఘటన రణతంబోర్ జాతీయ అభయారణ్యంలో కనిపించింది.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే పక్క పులి ఆహారం లాక్కోవడానికి మరో పులి ఎప్పుడూ ప్రయత్నించదు.

పులులు దేని ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి.అయితే మన దగ్గర స్థలాలు ఆక్రమించుకుంటే ఎలా గొడవలు జరుగుతాయో.

అడవిలో కూడా పులుల మధ్య స్థలాల గొడవలు ఉంటాయి.ప్రతీ పులి తనకంటూ కొంత పరిధిని పెట్టుకుంటుంది.

అది ఎప్పుడూ ఆ ఏరియాలోనే తిరుగుతూ అక్కడే వేటాడుకుంటూ అలా బతుకుతుంది.

ఇక తన పరిధిలో ఉన్న ప్రాంతంలోకి మరో పులి రాకూండా హెచ్చరిక కోసం సరిహద్దుల దగ్గర ఉన్న చెట్ల బెరళ్లను పులులు చీల్చుతాయి.ఆ బెరళ్లపై పులుల పంజా గీతలు ఉంటాయి.వాటిని చూసి మరో పులి ఆ ఏరియాలోకి రాదు.

పొరపాటున వచ్చిందంటే మాత్రం వీడియోలో లాగా గొడవ జరిగిపోతుంది.ఈ వీడియోలో ఓ పులి పేరు రిద్ధి.

మరో పులి దాని చెల్లెలు.వాటి మధ్యే గొడవ జరిగింది.

ఈ గొడవలో ఇష్టమొచ్చినట్లు కొట్టేసుకోవడమే కాదు. రిద్దీ నాలికను రిద్దీ చెల్లి కొరికేసింది.

దాంతో రిద్దీ ఓడిపోయింది.ఈ గొడవ తర్వాత రిద్దీని ఆస్పత్రికి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారట.

అంతలా అవి కొట్టేసుకున్నాయి మరి ఆ పులులు.

#Social Media #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు