వైరల్ వీడియో: పాపకు పాలు తాగడానికి కొత్త టెక్నిక్ చెబుతున్న తండ్రి..!

చిన్న పిల్లలను ఆరోగ్యంగా పెంచి పెద్ద చేసే విషయంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.పిల్లలు పెరిగి పెద్ద అయ్యేంతవరకు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

 Viral Video Father Telling New Technique To Reduce Milk For Sin-TeluguStop.com

పిల్లలకు ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులే పరిష్కరించుకోవాలి లేక వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.అయితే నేటి యుగంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల సమస్యలను తీర్చడానికి వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు.

అయితే తాజాగా ఒక తండ్రి తన బిడ్డ బరువును పెంచడానికి ఒక సరికొత్త ఆలోచన చేశారు.అదేంటంటే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల బరువు పెంచడం కోసం వినియోగించే బేబీ బీర్ బాంగ్ పరికరాన్ని తన ఎనిమిది నెలల కూతురు బరువు పెరగడం కోసం ఉపయోగించారు.

 Viral Video Father Telling New Technique To Reduce Milk For Sin-వైరల్ వీడియో: పాపకు పాలు తాగడానికి కొత్త టెక్నిక్ చెబుతున్న తండ్రి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆ పాప సాధారణ సమయాల్లో కంటే ఇప్పుడు ఎక్కువగా పాలు తాగడానికి మిగతా ఆహారం తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తోంది.ఫలితంగా ఆ తండ్రి ఐడియా వర్కౌట్ అయింది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.సియాటెల్ కి చెందిన రోడ్ విల్లింగ్ హమ్ యొక్క 8 నెలల కూతురు అయిన లిల్లీ బరువు చాలా తక్కువగా ఉంది.

దీనితో 2వ ఆసుపత్రి చెకప్ లోపు పాప బరువు పెంచాలని వైద్యులు సూచించారు.అప్పుడే ఆ తండ్రికి ఒక ఐడియా వచ్చింది.

అదేంటంటే.తన పాప బరువుని పెంచడానికి బేబీ బీర్ బాంగ్ పరికరాన్ని వినియోగించాలని.

ఐతే ఆ ఐడియా వచ్చిన వెంటనే ఆయన తన పాపకు సక్రమంగా పాలుతాగే విధంగా ఒక బేబీ బీర్ బాంగ్ తయారు చేసి దాని ద్వారా పాలను, మిగతా ద్రవపదార్థాలను పట్టిస్తూ బరువు పెంచుతున్నారు.

అయితే ఈ పరికరం ద్వారా ఎక్కువ పాలను తాగడానికి పాప ఆసక్తిని చూపిస్తుండటం విశేషం.

ఐడియా లిల్లీ తల్లికి కూడా బాగా నచ్చిందట.అందుకే తన భర్త తన పాపకు పాలు పట్టిస్తున్న దృశ్యాలను చిత్రీకరించి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

దీంతో ఆ తండ్రి ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షల వ్యూస్ రాగా వేలల్లో లైకులు వచ్చాయి.

#Drinking #Baby Beer Bong #Milk #Child Feed #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు