వైరల్ వీడియో: కళ్ళు మూసి తెరిచేలోపు కూతురికి పోనీ టైల్ వేసిన తండ్రి..!

ఏ తండ్రి తన కూతురి సంతోషం కోసం ఎంత కష్టమైనా చాలా ఇష్టంగా చేస్తుంటాడు.చాలా కుటుంబాలలో తండ్రీకూతుళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు.

 Viral Video Father Puts Pony Tail On Daughter Before Closing Eyes  Daughter, Fat-TeluguStop.com

ఒకరికొకరు బాగా మాట్లాడుకుంటూ కలిసి ఇంటి పనులు చేసుకుంటూ ఆటల్లో పోటీపడుతూ తమ పవిత్రమైన బంధాన్ని బలపరుచుకుంటుంటారు.పెళ్లయి అత్తగారింటికి వెళ్లిపోవాల్సి సమయం లో ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్లలేక బాగా ఏడ్చేస్తుంటారు.

ఐతే తండ్రీకూతుర్ల మధ్య చోటుచేసుకునే మధురమైన క్షణాలు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.

తాజాగా ఒక తండ్రి తన ముద్దుల కూతురికి జడ వేస్తున్న వీడియో నెట్టింట ప్రత్యక్షమయ్యింది.

ఈ వీడియో లో తండ్రి తన కుమార్తె కి కేవలం 5 సెకండ్స్ లలో జడ వేయడం మనం చూడొచ్చు.ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి తన కూతురు జట్టును క్షణాల్లోనే కొప్పుగా చేర్చి వెంటనే రబ్బర్ బ్యాండ్ తో జడ వేశారు.

అలాగే ఈ వీడియోని టిక్ టాక్ వేదికగా షేర్ చేశారు.అయితే టిక్ టాక్ మాధ్యమం లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.తండ్రి వ్యాక్యూమ్ క్లీనర్ తో జట్టు చుట్టేసి జడ వేయడం చూసి అందరూ ఫిదా అవుతున్నారు.అలాగే ఆయన సృజనాత్మకత ను తెగ ప్రశంసిస్తున్నారు.

అయితే వైరల్ అయిన ఈ వీడియో ని ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ దీపాన్షు కార్బా ట్విట్టర్ వేదికగా షేర్ చేసి డాడ్​ + డాటర్​ కూలెస్ట్ బెస్టీస్ అని పేర్కొన్నారు.అయితే ఇప్పటికే ఈ వీడియోకి దాదాపు 8 వేల వ్యూస్, 900 లైకులు వచ్చాయి.

అయితే తండ్రికూతుర్లను కలిపితే మిలియన్ డాలర్ల హ్యాపీనెస్ వస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ప్రతి తండ్రికి కూతురు అతిపెద్ద అండగా ఉంటుందని విశ్వాసపాత్రురాలిగా ఉంటుందని మరికొందరు నెటిజన్లు ఆడవారికి తమ తండ్రుల పట్ల ఎంత ఆప్యాయత, ప్రేమ, గౌరవం ఉంటుందో కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube