వెయిటర్ బాగున్నాడన్న కూతురు.. తర్వాత తండ్రి పరువు ఎలా తీసాడో చూడండి!

తాజాగా ఒక ఫన్నీ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది.ఈ వీడియోలో ఒక తండ్రి తన కూతురు పరువు తీసేసాడు.

 Viral Video Father Fun With Daughter When She Says Waiter Is Cute Details, Waite-TeluguStop.com

ఈ వీడియో క్లిప్ ను పూబిటీ అనే ఒక ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు తొమ్మిది లక్షల వరకు లైక్స్, కోటికి వరకు లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక తండ్రి ఇద్దరు కూతుర్లతో కలిసి ఒక హోటల్ లో కూర్చొని ఉండటం చూడవచ్చు.

అయితే ఒక కూతురు అక్కడే పనిచేస్తున్న వెయిటర్ ని చూసి “ఆ అబ్బాయి భలే ఉన్నాడు.

క్యూట్ గా ” అని తండ్రికి వినిపించేలా అనేసింది.అది వినగానే సదరు తండ్రి ఆ వెయిటర్ ని పిలిచి… “నా కూతురు నువ్వు చాలా బాగున్నావ్, క్యూట్ గా ఉన్నావ్ అని అంటోంది” అని అన్నాడు.

దాంతో ఆ వెయిటర్ సిగ్గుతో ఏం మాట్లాడాలో కూడా తెలియక అలానే నిల్చుండిపోయాడు.తర్వాత తన చేతిని గుండెపై పెట్టుకొని ధన్యవాదాలు అని తెలిపాడు.

అయితే తండ్రి ఇలా బోల్డ్ గా తన గురించి చెప్పడంతో కూతురు కూడా బాగా సిగ్గు పడింది.

సిగ్గుతో మొహం చూపించలేక, మొహం చేతులతో మూసుకుని బల్ల కిందికి దూరింది.ఈ వీడియోని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆ అమ్మాయి సిగ్గుతో బల్ల కింద కూర్చుని భోజనం చేసిందేమో అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.ఈ ఫన్నీ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube