వీడియో: పెంగ్విన్‌పై డేగలు మూకుమ్మడి దాడి.. సమయానికి దేవుడిలా వచ్చి కాపాడిన బాతులు..!

సాధారణంగా మనుషులు ప్రమాదంలో ఉన్నప్పుడు ఇతరులు వారిని కాపాడేందుకు ముందుకొస్తారు.కొన్ని సందర్భాల్లో మనుషులు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యం చేయలేరేమో కానీ చాలావరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు.

 Viral Video Ducks Save Penguin From Eagles Attack Details, Penguin, Viral Latest, News Viral, Social Media, Video Viral, Duck, Viral Video, Ducks Save Penguin ,eagles Attack, Eagles Attack On Penguin, Viral Animals Video, Ducks,-TeluguStop.com

అయితే జంతువులు, పక్షులు కూడా ప్రమాదంలో ఉన్న ఇతర జీవులను కాపాడేందుకు ముందుకు వస్తాయి.ఇప్పటికే ఎన్నో జీవులు ఇతర జీవులను కాపాడి తమ గొప్ప హృదయాన్ని చాటుకున్నాయి.

కాగా తాజాగా కొన్ని బాతులు ఒక పెంగ్విన్‌ను రక్షించి అందర్నీ ఫిదా చేస్తున్నాయి.దీనికి సంబంధించిన వీడియోని @figen అనే ఒక ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

 Viral Video Ducks Save Penguin From Eagles Attack Details, Penguin, Viral Latest, News Viral, Social Media, Video Viral, Duck, Viral Video, Ducks Save Penguin ,eagles Attack, Eagles Attack On Penguin, Viral Animals Video, Ducks, -వీడియో: పెంగ్విన్‌పై డేగలు మూకుమ్మడి దాడి.. సమయానికి దేవుడిలా వచ్చి కాపాడిన బాతులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోకి 21 లక్షలకు పైగా వ్యూస్, 80 వేల వరకు లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో సముద్రతీరంలో ఒక పెంగ్విన్ పిల్ల ఉండటం చూడవచ్చు.

అయితే దీనిని గమనించిన కొన్ని డేగలు అక్కడికి దూసుకొచ్చాయి.ఈ బలహీనమైన పెంగ్విన్ పిల్లని ఆహారం చేసుకుందామని అవన్నీ చుట్టుముట్టాయి.

తర్వాత తమ ముక్కులతో బలంగా పొడవటం స్టార్ట్ చేశాయి.అయితే ఆ పెంగ్విన్ సముద్రంలోకి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకోవాలని చాలా వేగంగా పరిగెత్తడం స్టార్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో ఆ గద్దలు పెంగ్విన్‌ను బాగా గాయపరిచాయి.దీంతో ఆది కింద పడుతూ లేస్తూ చాలా దయనీయమైన పరిస్థితిలో కనిపించింది.

అయితే సముద్రంలో ఉన్న బాతులు దీనిని గమనించి చలించిపోయాయి.పెంగ్విన్ ని కాపాడేందుకు అవి ముందుకొచ్చాయి.అవి డేగలతో పోరాడుతూ వాటిని తరిమి కొట్టాయి.దీంతో పెంగ్విన్ ప్రాణాలు దక్కాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఎమోషనల్ అవుతున్నారు.ఈ బాతులను పొగుడుతున్నారు.

డేగల క్రూరమైన దాడి నుంచి పెంగ్విన్ ని కాపాడిన ఈ బాతులను రియల్ హీరోగా మరికొందరు పేర్కొంటున్నారు.వైరల్ అవుతున్న ఈ హార్ట్ టచింగ్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube