వైరల్ వీడియో: కనురెప్ప పాటులో ఊహకు అందని యాక్సిడెంట్..!

కొన్ని కొన్ని రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తాయో ఎవరు కూడా ఊహించడానికి అంతుపట్టదు.కొన్ని సందర్భాలలో మనము ఎంత జాగ్రత్తగా వెళ్తున్న సరే అవతలి వారు చేసే చిన్న చిన్న తప్పులతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video Drunken Driver Rams Audi Car Into Auto In Hyderabad-TeluguStop.com

కొంతమంది చేసే నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల గాని, తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలలో చాలా మంది కుటుంబలో తీరని విషాదం నెలకొంది.కొన్ని కొన్ని సందర్భాలలో అధిక వేగం, సిగ్నల్ జంప్ చేయడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం ఇలాంటి చిన్న చిన్న తప్పులే రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

అలాంటి సంఘటన ఒకటి ఇటీవల భాగ్యనగరంలో చోటుచేసుకుంది.

 Viral Video Drunken Driver Rams Audi Car Into Auto In Hyderabad-వైరల్ వీడియో: కనురెప్ప పాటులో ఊహకు అందని యాక్సిడెంట్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.

అది కాస్త వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

హైదరాబాద్ నగరంలోని ఇనార్బిట్ మాల్ సమీపంలో సంభవించిన ఈ రోడ్డు ప్రమాదం అందర్నీ ఆశ్చర్యానికి కలుగ చేయడంతో పాటు షాక్ కు గురి చేస్తుంది.

రెప్పపాటు క్షణంలోనే మొత్తం అతలాకుతలం అయిపోయింది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఓవర్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఒక కార్ అనుకోకుండా పక్కనే ప్రయాణిస్తున్న ఆటో ఢీ కొట్టింది.దీంతో ఒక్కసారిగా ఆటో గిరగిరా తిరిగి డివైడర్ ను ఢీకొని బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ చనిపోయినట్లు అర్థమవుతోంది.

అంతేకాకుండా అటు ఆటో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.ఇక ఈ రోడ్డు ప్రమాదం జూన్ 27 తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం.ఇక ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉండే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడంతో అసలు నిజం బయటికి వచ్చింది.ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఈ ఆక్సిడెంట్ వీడియోను ఒక లుక్ వేయండి.

#Road #Passenger #Rams Auto #Drunken #Speed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు