వైరల్: ఓ వ్యక్తికి Z కేటగిరి సెక్యూరిటీ ఇస్తున్న శునకాలు.. ఎక్కడంటే?

ఈ భూ ప్రపంచంలో కుక్కలను ఇష్టపడేవారు ఇంచుమించుగా లేరనే చెప్పుకోవాలి.వాటిని సొంత ఇంటిలో సభ్యుల్లాగా మనుషులు ట్రీట్ చేస్తారు.

 Viral Video Dogs Giving Z Category Security To Man Viral Video-TeluguStop.com

ఖర్చు కూడా అలాగే ఉంటుంది.ఒక్కోసారి ఓ మనిషి తిండికి అవసరమైన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు వాటికోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎందుకంటే అవి పూర్తిగా మాంసాహారులు కనుక.అలాగే శునకాలు కూడా మనుషులపై అదే విధంగా ప్రేమను కురిపిస్తాయి.

 Viral Video Dogs Giving Z Category Security To Man Viral Video-వైరల్: ఓ వ్యక్తికి Z కేటగిరి సెక్యూరిటీ ఇస్తున్న శునకాలు.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవి మనుషులకంటే ఎక్కువ విశ్వాన్ని కలిగి ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఇపుడు ఇక్కడ ప్రస్తావించిన వార్త వింటే మీకే అర్ధం అవుతుంది.

వాటి విశ్వాసం ఏ రేంజులో ఉంటుందో అని.

పెంపుడు జంతువుల పట్ల మనలో అనేకమంది చాలా స్పెషల్ కేరింగ్ చూపిస్తారు.ఉదయం, సాయంత్రం విధిగా వాటిని వాకింగ్‌కు తీసుకువెళ్లాల్సిందే.అలా జాగింగ్ కు తమ కుక్కల్ని తీసుకుని వెళ్తూ.యజమాని ఎంజాయ్ చేస్తున్న వీడియోలు అనేకం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి.అయితే తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.

ఈ వీడియోలో ఒక వ్యక్తి.సంబంధించిన వీడియో ఎక్కువగా ఇపుడు వైరల్ అవుతోంది.

అది చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఎందుకంటే.

వ్యక్తి భద్రత ముందు మంచి రాజకీయ నాయకులకు భద్రత కూడా దిగదుడుపే అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఏముందో ఒకసారి చూసినట్లయితే, ఒక వ్యక్తి తన డజను కుక్కలతో సంతోషంగా రోడ్డుపై నడవడం మనం గమనించవచ్చు.ఇక ఇది చూడటానికి ఎలా ఉందంటే, ఆ శునకాలు తమ యజమానికి ఈగ కూడా వాలనంత దగ్గరగా నడుస్తున్నాయి.అచ్చం ఓ VIPకి Z సెక్యూరిటీ ఇస్తారు కదా.ఆ మాదిరి ఆ యజమానిని అవి కాపాడుతున్న విధానం న భూతొ న భవిశ్యతి అని చెప్పుకోవాలి.ఈ వీడియోను ట్విటర్‌లో బ్యూటెంగెబిడెన్ అనే ఖాతా లో షేర్ చేయగా, లక్షలకు పైగా వ్యూస్ ను, 69 వేలకి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube