వైరల్ వీడియో: పులుల మధ్య సేదతీరుతున్న శునకం.. చివరికి..?!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.వాటిల్లో జంతువులకు సంబందించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Viral Video Dog Which Is Relaxing By Sitting Between The Tigers, Viral Latest, V-TeluguStop.com

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక జంతువుకు సంబందించిన వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి నెటిజెన్ల మనసులను దోచుకుంటుంది.

మామూలుగానే అడవి అంటేనే రకరకాల జంతువులు నివాసం ఉంటాయి.అయితే అన్ని జంతువుల్లో కెల్లా పులికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

ఎందుకంటే పులి పంజా విసిరిదంటే ఎలాంటి జంతువు అయినా సరే దానికి ఆహారం అవ్వవలిసిందే.

జంతువులకే కాదు మనుషులకు కూడా పులి పేరు వినగానే ఎక్కడ లేని భయం వస్తుంది.

అందుకే అడవిలో పులి ఆధిపత్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.అందుకే చాలా చిన్న జంతువులు పులికి దూరంగా ఉంటాయి.

అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.అందుకే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది.

ఒక కుక్క పాపం పులి ఉండే చోటిలోకి వెళ్లి కూర్చుంది.బహుశా ఆ కుక్కకు తెలియదేమో పులి ఎంత ప్రమాదకరమైన జంతువో అనే విషయం.

అయితే అక్కడ ఉంది ఒక్క పులి కాదు ఏకంగా ఐదు పులులు ఉన్నాయి.వాటిని చూసి మనకే గుండె జారిపోతుంటే మరి ఆ కుక్క పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించండి.దర్జాగా నాకు ఏమి భయం లేదు అని ఎంచక్కా వాటి మధ్యలో కూర్చుంది.అందులో ఏ పులి అయినా పంజా విసిరిందంటే చాలు ఆ కుక్క పని అంతే సంగతులు.

కానీ అక్కడ మనం అనుకున్నట్లు ఏమి జరగలేదు ఆ పులులు ఆ కుక్కను ఎంతో ప్రేమగా తాకుతాయి.ఆ వీడియో చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో పట్ల ఎవరికీ తోచిన కామెంట్స్ వారు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube