వైరల్ వీడియో: జోరు వర్షంలో రోడ్డుమీద తడుస్తూ కుక్క.. దాంతో ఆ చిన్నారి ఏం చేసిందంటే..?!

చిన్నారులు అంటే కళ్లాకపటం లేని వారు.నిస్వార్థం తెలియనివారు.

 Viral Video Dog Stomping On The Road In Heavy Rain What Did That Child Do With It-TeluguStop.com

కల్మషం లేనివారు.అందుకే వారి నవ్వు అందరికీ ఇష్టం.

వాటి మాటలు అందరికీ ముచ్చటగా ఉంటాయి.చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి పెద్దల మనసుల్ని కదిలించేస్తాయి.

 Viral Video Dog Stomping On The Road In Heavy Rain What Did That Child Do With It-వైరల్ వీడియో: జోరు వర్షంలో రోడ్డుమీద తడుస్తూ కుక్క.. దాంతో ఆ చిన్నారి ఏం చేసిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజం చెప్పాలంటే చిన్నారుల ప్రవర్తన పెద్దల మనసును మార్చి, కొత్త జీవితాలకు పునాదులు వేసే అవకాశం కూడా ఇస్తుంటుంది.అందుకే ఓ చిన్నారి చేసిన చిన్న పని చేసినా అందరికీ ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.

ఇప్పుడు కూడా ఓ చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది.చిన్న బాలిక చేసిన ఆ పనితో దయ అనే పదానికి సరైన నిర్వచనాన్ని సూచించింది.

ట్విట్టర్ లో ఇప్పుడొక వీడియో హల్ చల్ చేస్తోంది.వర్షం పడుతుండటంతో రోడ్డుమీద ఒక కుక్క తడిచిపోతోంది.

అక్కడే గొడుగు వేసుకుని ఒక చిన్న పిల్ల నిలుచుని ఉంది.ఆ సమయంలో అక్కడ ఉన్న తదిచిపోతున్న కుక్కను చూసింది.

తన గొడుగు తీసుకెళ్ళి ఆ కుక్కపై వర్షం పడకుండా అడ్డు పెట్టింది.దానిని జాగ్రత్తగా రోడ్డు దాటించి తీసుకువెళ్ళింది.

అలాగే, ఆ కుక్కను వదిలేయడానికి ఆ చిన్నారి ఒప్పుకోలేదు.ఎంతో దయామయంగా కనిపించిన ఈ చిన్నారి చేసిన పని ఇప్పుడు అందరి మనసుల్నీ మార్చివేస్తోంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా ఈ రోజు ట్విట్టర్‌ లో షేర్ చేశారు.ఆయన ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే వందలాది మంది దీనిని రీట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చేస్తూ సుశాంత నందా “దయ మరొకరి కోసం చిన్నచిన్న పనులు చేయిస్తుంది.ఇదే పనీ దయతో మీరు చేయగలరు” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

చిన్నారుల నడవడికలు పెద్దల మనసులను మార్పు చేస్తాయనేది దాని సారాంశం.

#Kindness #Child Helpp #Viral Video #Rain Fall #Socail Meida

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు