వైరల్ వీడియో: యజమానికి అస్వస్థత కావడంతో.. ఆ శునకం ఏం చేసిందంటే..?!

ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం కల జీవులు ఏవంటే టక్కున కుక్కలనే చెబుతారు.నేటి రోజులలలో కుక్కలు ప్రతి ఇంటిలోనూ ఉన్నాయి.కుక్కలను చాలా మంది తమ కుటుంబంలోని సభ్యులులాగా చూస్తుంటారు.అందుకే ఆ కుక్కలకు యజమానులు అంటే చాలా ప్రేమ.ఒకవేళ ఉన్నట్టుండి కుక్కకు ఏమన్నా జరిగితే కుటుంబంలోని వారు తల్లడిల్లిపోతారు.అదే కుక్క చనిపొతే ఆ ఇంట్లో విషాదం నెలకొంటుంది.

 Viral Video Dog Follows Owner In Ambulance In Turkey-TeluguStop.com

అదేవిధంగా కుక్కలు కూడా తమ యజమానులకు ఏమన్నా జరిగితే తట్టుకోలేవు.తమకు నోటి ద్వారా మాటలు రాకపోయినా వాటి సైగలతో అవి తమ బాధను వ్యక్తపరుస్తుంటాయి.

వాటి ప్రవర్తనతో తమ ఏడుపును ప్రదర్శిస్తుంటాయి.తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

 Viral Video Dog Follows Owner In Ambulance In Turkey-వైరల్ వీడియో: యజమానికి అస్వస్థత కావడంతో.. ఆ శునకం ఏం చేసిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టర్కీలోని ఓ యజమాని తమ కుక్కను చాలా బాగా చూసుకునేవాడు.ఆ కుక్కకు కూడా యజమాని అంటే చాలా ఇష్టం.అలాంటిది ఓ రోజు యజమానికి అనారోగ్యం చేసింది.దీంతో ఆయన తన అనారోగ్యం పట్ల తట్టుకోలేకపోయాడు.

ఆయన్ని వెంటనే అంబులెన్సు ద్వారా హాస్పిటల్ కు తీసుకెళ్లారు.ఆ సమయంలో కుక్క తల్లడిల్లిపోయింది.

వెంటనే అంబులెన్సుతో పాటుగా పరుగులు తీసింది.కుక్క తన యజమాని కోసం రోడ్డు వెంట పరుగులు తీస్తూ ఆస్పత్రి వరకూ వెళ్లింది.

ఆ మహిళా యజమానికి అనారోగ్యం వల్ల ఇంట్లోనే చికిత్స పొందుతోంది.అయితే ఒకరోజు పరిస్థితి కాస్త క్షీణించడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది.

ఆ టైంలో వైద్య సిబ్బంది అంబులెన్సును తీసుకొచ్చారు.

వారు కుక్కను అంబులెన్సులోనికి రానివ్వలేదు.దీంతో ఆ కుక్క రోడ్డుపైనే అంబులెన్సును ఫాలో అయ్యింది.ఆ తర్వాత ఆస్పత్రిలో తన యజమానికి కలుసుకుని ప్రేమను చూపింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.యజమాని కోసం కుక్క చేసిన పనికి, ప్రేమకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కుక్కే నిజమైన విశ్వాస జీవి అంటూ వీడియో ద్వారా స్ఫష్టమైందని తెలుపుతున్నారు.

#Hospital #Owner #Ambulance #Sick #Loyal Dog

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు