వైరల్ వీడియో: మెరుపువేగంతో గిన్నిస్ రికార్డు సాధించిన శునకం.. ఎలాగో తెలుసా..?!

సోషల్ మీడియా అంటే అదొక గమ్మత్తైన వేదిక.ఇక్కడ అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి.

 Viral Video Dog Creates Guinness World Record By Blasting More Balloons In Less Time-TeluguStop.com

చాలా మంది సోషల్ మీడియాలో విచిత్రమైన వీడియోలు, ఆశ్చర్యపరిచే వీడియోలను చేస్తుంటారు.అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ఓ కుక్క చేసిన పనికి అందరూ అవాక్కైపోతున్నారు.ఆ కుక్కను చూసి చాలా మంది నోరెళ్ల బెడుతున్నారు.

 Viral Video Dog Creates Guinness World Record By Blasting More Balloons In Less Time-వైరల్ వీడియో: మెరుపువేగంతో గిన్నిస్ రికార్డు సాధించిన శునకం.. ఎలాగో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని సెకన్లపాటు ఆ కుక్క ఎంతో వేగంగా బుడగలను తన పంజాతో పగలగొట్టేసింది.దీంతో ఆ కుక్క రికార్డు నెలకొల్పింది.

తక్కువ టైంలోనే ఎక్కువ బెలున్లను ఆ కుక్క పగలగొట్టేసింది.దీంతో ఆ కుక్క రికార్డును క్రియేట్ చేసింది.

అంతటి ఘనతను సాధించిన ఆ కుక్క పేరు ట్వింకి.ఆ కుక్క అత్యంత వేగంగా పగలగొట్టడం వల్ల అది ఆ రికార్డును సాధించింది.కేవలం 39.08 సెకన్లలోనే 100 బుడగలను అది పగలగొట్టింది.ట్వింకి జాక్ రస్సెల్ అనేది సాధారణమైన కుక్క కాదు.ఇదొక టెర్రియర్ జాతికి చెందిన కుక్క అని తెలుస్తోంది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటువంటి కుక్కల పోటీని నిర్వహించారు.ఈ పోటీల్లో కుక్క ఈ రికార్డును నెలకొల్పింది.

కుక్క మెరుపు వేగంతో బెలూన్లను పగలగొట్టింది.ఆ కుక్క బుడగలను పగలగొట్టిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడిది కాదు.ఈ వీడియో చాలా పాతది.

ఈ వీడియో 2014వ సంవత్సరానికి చెందినది.ఇప్పుడీ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కుక్కకు ఉన్నటువంటి ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో ఒక లక్ష 15వేలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.ఇంకా ఈ వీడియోను చాలా మంది చూస్తూనే ఉన్నారు.ఎంతో మంది ఇష్టపడుతున్నారు.గతంలో ఈ కుక్క ట్వింకి కన్నా ముందుగా బ్రిటన్ కి చెందిన వండర్ డాగ్ క్యాలీ పేరుపై ఆ రికార్డు అనేది ఉంది.ఆ కుక్క అప్పుడు 41.67 సెకన్లలోనే 100 బెలూన్లను తన పంజాతో పగలగొట్టింది.

#World #Dog #Guinness World #Guniess

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు