వైరల్ వీడియో: ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహం పై శునకం దాడి..!  

కొన్ని సంఘటనలు చూస్తే మనసు చలించిపోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు.తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే ఖచ్చితంగా మనసు చెల్లించి పోయేలా ఉంది.

TeluguStop.com - Viral Video Dog Attack On Dead Body In Government Hospital

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది.

రోడ్డు ప్రమాదానికి గురైన ఓ చిన్నారి కి వైద్యం కోసం ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.అయితే ఆ బాలిక చికిత్స పొందుతూ మరణించింది.

TeluguStop.com - వైరల్ వీడియో: ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహం పై శునకం దాడి..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత ఆ బాలిక శవాన్ని తెల్లటి గుడ్డలో చుట్టి ఉన్న మృతదేహాన్ని ఆస్పత్రిలోని ఓ స్ట్రక్చర్ పై ఒక మూలన ఉంచారు.

అలా ఉంచిన స్ట్రక్చర్ ను ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు.

అలా వదిలేసిన శవాన్ని తాజాగా ఓ కుక్క పిక్కు తినటానికి ప్రయత్నించింది.ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో తెగ సంచలనంగా మారింది.

నిజంగా ఈ వీడియో చూస్తే మన మనసు చలించిపోతుంది.సామాజిక మాధ్యమాలలో ఆ వీడియోను చూసిన ఎంతో మంది నెటిజన్లు ఆ చిన్నారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ ఘటనకు కారకులైన వారిని శిక్షించాలంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై మృతురాలి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన చేశారు.

ఈ ఘటనపై హాస్పిటల్ అధికారులు మాట్లాడుతూ.అదే రోజు ఎక్కువ మరణాలు ఆస్పత్రిలో సంభవించడంతో సిబ్బందిపై పని వత్తిడి ఎక్కువగా ఉండటంతో ఇలా జరిగిందని చెబుతున్నారు.

ఆ ప్రాంతంలో వీధి కుక్కల సమస్య ఎక్కువగా ఉందని అధికారులు వాపోతున్నారు.అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరి ఉద్యోగులను ఆసుపత్రి వర్గాలు సస్పెండ్ చేసినట్లు తెలిపాయి.

#Eating #Suspended #Dead Body #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Video Dog Attack On Dead Body In Government Hospital Related Telugu News,Photos/Pics,Images..