వైరల్ వీడియో : ఈ మందు బాబు డ్రైవింగ్ చూడండయ్యా. !

ఎన్ని చట్టాలు అమలు చేసిన, ఎన్ని శిక్షలు వేసినాగాని తమ పని తాము చేసుకుంటూ పోతాము అంటున్నారు మందు బాబులు.మద్యం మత్తులో అసలు ఏం చేస్తున్నారో మర్చిపోయి వాహనాలు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్స్ చేస్తున్నారు.

 Viral Video: Did You See This Drug Driving Driving. ! Viral Video, Viral Latest,-TeluguStop.com

మద్యం తాగి వాహనాలు నడపొద్దని పదే పదే చెప్తున్నా గాని కొందరు మాత్రం తమపని తమదే అంటున్నారు.దీంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి.

వాళ్ళు తాగిన మత్తులో అస్తవ్యస్తంగా డ్రైవింగ్ చేసి ఎదుటోళ్ల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు.రోడ్లపై రద్దీగా ఉండే క్రమంలో వీళ్ళ చేష్టలకు వాహనాల రాకపోకలకు ఆటకం ఏర్పడుతుంది.

తాగి నడి రోడ్లపై వింత విన్యాసాలతో ఇతర వాహనదారులకు అడ్డు పడుతున్నారు.ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇలా తాగిన మత్తులో ఓ బైకర్ చేసిన విన్యాసాలు పూర్తిగా సీసీటీవీలో రికార్డు అయ్యాయి.ఈ సీసీటీవీ ఫూటేజీని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాగేసి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కిందపడ్డాడు.

రోడ్డు పక్కన వెళ్లే వ్యక్తి వచ్చి అతన్ని లేపి వెళ్ళాడు.అక్కడితో ఆగకుండా మళ్ళీ బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ఎదురుగా, వెనుక వైపు నుంచి వచ్చే ఇతర వాహనాలకు అడ్డంగా బైక్‌ ను నడపడం మొదలుపెట్టాడు.

తరువాత రోడ్డుపై వెళ్తున్న మరో కారును ఢీ కొట్టాడు.డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని కోరుతూ సైబరాబాద్ పోలీసులు ఈ వీడియోను షేర్ చేయగా.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది.కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ మద్యం మత్తులోఅనే ఒక క్యాప్షన్ జత చేశారు ట్రాఫిక్ పోలీసులు.రోడ్డంతా నాదే అన్నట్లు సాగే ఆ మందుబాబు డ్రైవింగ్ విన్యాసాలు చూసేవారికి నవ్వులు తెప్పించినగాని, రోడ్డుపై వెళ్లే ఇతరులకు మాత్రం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ దైన స్టైల్ లో కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ ఆ వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరాడా అని అడగగా స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం తాగి వాహనాలు నడపటం చట్ట రీత్యా నేరం అనే విషయాన్నీ ఒకసారి గుర్తుచేసుకోండి.

మీ ప్రాణాలతో పాటు మీ కుటుంబం సభ్యుల జీవితాలను కూడా ఒకసారి గుర్తు చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube