వైరల్ వీడియో: అంగారకుడిపై రోవర్‌ శాటిలైట్‌ లాంచింగ్ చూశారా..?!

మార్స్ ‌పై జరుగుతున్న పరిశోధనల్లో మరో అద్భుతం చోటు చేసుకుంది.అంగారక గ్రహంపై పర్సవరన్స్ రోవర్ ల్యాండ్ అవుతున్న అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియోను అమెరికా ఆడియో రికార్డింగ్‌ను విడుదల చేసింది.

 Viral Video Did You See The Perseverance Rover Satellite Launching On Mars ,  Ma-TeluguStop.com

ఇలాంటి శబ్దాల వీడియోను విడుదల చేయడం ఇదే మొదటి సారి అని.ఇది నిజంగా ఎంతో అద్భుతమైన వీడియో అని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖల్ వాట్కిన్స్ పేర్కొన్నాడు.అంగారక గ్రహంపై నుంచి ఆడియో సేకరించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

కాగా, ఫిబ్రవరి 18వ తేదీన పర్సవరన్స్ రోవర్ ల్యాండింగ్‌కు సంబంధించిన ఆడియోను రికార్డ్ చేసేందుకు 7 కెమెరాలను ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.

రోవర్‌లో మొత్తంగా 2 మైక్రోఫోన్లు, 25 కెమెరాలు ఉన్నాయి.వీటితో భవిష్యత్‌లో ఫోటోలు, వీడియోలు సేకరించవచ్చని నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ తెలిపారు.ప్రస్తుతానికి 7 కెమెరాలను ఉపయోగించి ఆడియోను సంపాదించామన్నారు.

అంగారక గ్రహంపై పర్సవరన్స్ రోవర్ ‌ను శుక్రవారం ల్యాండ్ చేశారు.ఇది అరుణ గ్రహంలో ప్రవేశించిన డీసెంట్ అండ్ ల్యాండింగ్ (ఇడీఎల్) చివరి క్షణాల్లో ప్రధాన మైలు రాళ్లను చిత్రీకరించింది.రోవర్ ల్యాండ్ అయ్యే క్షణంలో ప్యారాచూట్ గాల్లోకి విచ్చుకోవడం.

రోవర్ కిందికి దిగుతున్న సమయంలో మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల పాటు కొనసాగే హై – డెఫినెషన్ వీడియో క్లిప్ ‌ను సంపాదించినట్లు నాసా పేర్కొంది.మార్స్ ఉపరితం వీడియో కూడా కనిపించింది.

గ్రహానికి దగ్గరగా వెళ్తున్న వీడియో కూడా కనిపించింది.

ఈ వీడియోను చూస్తున్నట్లయితే రోవర్ దిగుతున్నప్పుడు అక్కడి నేలంతా ఎర్రగా కనిపిస్తోంది.

రోవర్ ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రాంతంలో దుమ్ము, ధూళితో కూడిన ప్రాంతం, ఎర్రటి నేలలు, కొండలు కనిపిస్తున్నాయి.దగ్గరికి వెళ్లినప్పుడు దుమ్ముతో కూడిన పొగలు ఏర్పడుతాయి.

చివరకు విజయవంతంగా రోవర్‌ను మార్స్ గ్రహంపై ల్యాండ్ అయ్యింది.ఈ మేరకు మార్స్ ‌పై పర్సవరన్స్ రోవర్ ‌ను ల్యాండ్ చేసినట్లు నాసా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube