వైరల్ వీడియో: కోటి రూపాయల డబ్బులతో అమ్మవారికి అలంకరణ..!

దేశవ్యాప్తంగా ఘనంగా దసరా వేడుకలు ముగిశాయి.కరోనా వైరస్ భయం ఉన్నాసరే తెలుగు రాష్ట్రాల్లోనూ, అలాగే ఉత్తర భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల ప్రజలు తెల్లవారుజాము నుండి ఆలయాలకు పోటెత్తారు.

 Viral Video Decoration For Sale With Crore Of Rupees Viral Video, Social Media,-TeluguStop.com

వివిధ అలంకరణలో అమ్మవారిని రెడీ చేసి భక్తులకు సందర్శనార్థం ఉంచారు.ఇక అసలు విషయంలోకి వెళితే.

గద్వాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈసారి కూడా ఘనంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.ప్రస్తుతం ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇందులో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత ను భక్తులు కోటి రూపాయల విలువైన నోట్లతో అత్యంత సుందరంగా అలంకరించారు.ఇందుకోసం జపాన్ దేశస్తులు కాగితాలను పువ్వులుగా రకరకాలుగా చేసే ఒరిగమి కళను ఇందుకోసం వాడారు.

ఇందులో భాగంగానే కరెన్సీ నోట్లను పువ్వులుగా, పూలగుత్తులుగా, పూలదండలుగా వివిధ రకాలుగా సమకూర్చి ఎంతో దేదీప్యమానంగా అలంకరణ చేశారు.ఇకపోతే భక్తులు అమ్మవారికి అలంకరణలో భాగంగా. 1,11,11,111 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకారం చేశారు.అయితే ఇదే ఆలయంలో ఇంతకుముందు 3,33,33,333 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకారం చేశారు.

ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా అలంకరణకు అవసరమైన డబ్బు కాస్త తగ్గడంతో కేవలం కోటి రూపాయలు విలువ చేసే కరెన్సీ నోట్లతో చేశారు.

ఈ అలంకరణలో భాగంగా వాడిన డబ్బును 50 మంది భక్తులు అందజేశారని ఆలయ అధికార కమిటీ సభ్యులు తెలిపారు.

ఇక మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ సంబంధించి విగ్రహాలను దుర్గమ్మ మండపాల్లో ఏర్పాటు చేయగా, అలాగే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తలను నరికే విధంగా ఉన్న విగ్రహాలను కూడా దుర్గమ్మ మండపాల్లో ఏర్పాటు చేశారు.ఇకపోతే అమ్మవారికి అంత డబ్బులను ఏవిధంగా అలంకరణ చేశారో మీరు కూడా ఓ లుక్ వేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube