వైరల్ వీడియో: కత్తిపట్టిన డేవిడ్ భాయ్..!

ఆస్ట్రేలియా జట్టు స్టార్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ముగిసిన తర్వాత మరోసారి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు.తాజాగా అలా వైకుంఠపురంలో సినిమాలోని పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించిన నేపథ్యంలో అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 Viral Video David Warner Is Acting Look Like Ntr, Viral Video, Social Media, Dav-TeluguStop.com

తాజాగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని ఫైట్ సన్నివేశాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన ముఖాన్ని ఉంచి నటిస్తూ ఉన్న వీడియోని తన అభిమానులకు షేర్ చేశాడు.ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ ను మార్ఫింగ్ చేసి అతడు ముఖాన్ని కనిపించేలా వీడియో ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో కి సంబంధించి వార్నర్.‘ఈ వీడియో ఎలా ఉంది.? ఇది ఏ సినిమా కి సంబంధించింది.? ఇందులో హీరో ఎవరు అంటూ.?’ అడుగుతూనే ఈ ప్రశ్నలకు ఎక్కువ మంది సమాధానం చెప్పలేరు అంటూ పోస్ట్ చేశాడు.ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతా లో పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఏకంగా లక్షల సంఖ్యలో లైకులు రావడమే కాకుండా బాగా వైరల్ గా మారింది.

ఈ వీడియో పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.వేల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.ఇలా టాలీవుడ్ సినిమాలను డేవిడ్ వార్నర్ ఉపయోగించుకోవడం కొత్త ఏమి కాదు ఇది వరకు లాక్ డౌన్ సమయంలో కూడా ఈ స్టార్ బ్యాట్స్మెన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

టాలీవుడ్ సినిమాల్లోని తెలుగు పాటలను ఎంచుకొని వాటికి తనదైన శైలిలో తన భార్యతో కలిసి స్టెప్పులు వేసి తెగ వీడియోలు చేసేవాడు.

దాంతో తెలుగు ప్రేక్షకులకు డేవిడ్ వార్నర్ మరింత దగ్గరయ్యాడు.కేవలం పాటలు మాత్రమే కాదు కొన్ని సినిమా డైలాగ్స్ కూడా డబ్ స్మష్ చేసి తెలుగు వారిని ఆనంద పరిచాడు.

ఇకపోతే ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాటలను తీసుకొని వాటికి తన భార్యతో కలిసి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ఓ సెన్సేషనల్ గా మారిపోయాయి.ఇదివరకు కేవలం అల్లు అర్జున్, మహేష్ బాబు ల ను అనుకరించిన డేవిడ్ వార్నర్ తాజాగా ఎన్టీఆర్ అనుసరించాడు.

కొందరు నెటిజెన్స్ వార్నర్ ను ఇలా వదిలేస్తే చివరికి టాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.ఇదివరకు కూడా కొన్ని డైలాగులు చెబితే పూరి జగన్నాథ్ తన సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానని కూడా చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube