వైరల్ వీడియో: మరోసారి రెచ్చిపోయిన డేవిడ్ భాయ్..!

ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు అయిన డేవిడ్ వార్నర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

ముఖ్యంగా టిక్ టాక్ లో ఆయన ఎన్నో రకాల పాటలకు డాన్స్ వేస్తూ.

కొన్ని రకాల డైలాగ్ లకు , డబ్ స్మాష్ లు చేస్తూ తెగ హల్చల్ చేస్తూ ఉంటాడు.కేవలం డేవిడ్ వార్నర్ మాత్రమే కాకుండా అతని కుటుంబసభ్యులు కూడా ఆయనతో జత కలిసి అనేక వీడియోలను చేస్తూ ఉంటారు.

ఇక డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండడంతో భారత్ ఆయనకు రెండో ఇంటిగా మారిపోయింది.ఇక హైదరాబాద్ కు సంబంధించిన పరిస్థితులను కూడా ఆయన అవగాహన తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఎన్నో సినిమాలోని పాటలను తీసుకుని తనదైన శైలిలో ముఖ్యంగా తెలుగువారిని ఎప్పటికప్పుడు ఆశ్చర్య పరుస్తూనే ఉంటాడు.

Advertisement

ఇక తాజాగా మరోసారి డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో రెచ్చిపోయాడు.బాహుబలి చిత్రంలోని ఫైట్ సీన్ లో హీరో ప్రభాస్ మొహాన్ని మార్ఫింగ్ చేసి తన ముఖం ఉండేలా మొత్తం రెండు వీడియోలను పోస్ట్ చేశాడు.ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

బాహుబలి మొదటి పార్ట్ లో జరిగే యుద్ధం సీన్ ను డేవిడ్ వార్నర్ మార్ఫింగ్ చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనేకమంది ఈ వీడియోల పై కామెంట్స్ చేస్తున్నారు.

కొందరైతే జై బాహుబలి.జై వార్నర్ బలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో భాగంగా గాయపడిన అతడు గత పది రోజుల నుంచి కోలుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.మరో రెండు రోజుల్లో టీమిండియాతో మొదలు కాబోతున్న టెస్ట్ సిరీస్ కోసం వార్నర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇప్పటికే భారత్ వన్డే, టి20 సిరీస్ లు ముగించగా టెస్ట్ సిరీస్ తో అమితుమీ తేల్చుకోనుంది.మొదట జరిగిన వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా ఆతర్వాత జరిగిన టి20 సిరీస్ ను టీమిండియా గెలిచింది.

Advertisement

ఇప్పుడు టెస్ట్ సిరీస్ పై మరింత ఉత్కంఠ నెలకొంది.

తాజా వార్తలు