వైరల్ వీడియో: ప్రాణాల మీదకి తెచ్చిన ఓవర్ టేక్.. !

ఒక్కోసారి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.ఇంటి నుంచి ఎంతో సంతోషంగా బయటకు వెళ్లిన వ్యక్తి విగత జీవై ఇంటికి తిరిగి వస్తే ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలకు, కన్నీటిని ఆపడం ఎవరి వల్లా కాదు.

 Viral Video Cyberabad Traffice Police Shared Accident Video While Overtaking At Bachupalli-TeluguStop.com

రోడ్డు మీద ప్రయాణం అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి.డ్రైవింగ్ చేసే సమయంలో వెనుక వచ్చే వాహనాలను చూసుకుంటూ ఉండాలి.

అతివేగం అనేది ఎప్పటికన్నా ప్రమాదమే.అందుకని నిదానమే ప్రధానం అని గుర్తు పెట్టుకోండి.

 Viral Video Cyberabad Traffice Police Shared Accident Video While Overtaking At Bachupalli-వైరల్ వీడియో: ప్రాణాల మీదకి తెచ్చిన ఓవర్ టేక్.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీరు చేసే చిన్న పొరపాటు వలన మొత్తం మీ కుటుంబం రోడ్డున పడుతుంది.మనం జాగ్రతగా డ్రైవింగ్ చేస్తూ మన ప్రాణాలతో పాటు పక్కవారి ప్రాణాలను కూడా కాపాడదాం.

ఆఫీస్ కు లేట్ అవుతుందనో.మరే కారణం చేతనో తిందరగా గమ్యాన్ని చేరుకోవాలనే కంగారులో అతివేగంతో డ్రైవ్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి.

లేట్ అవుతుందని అనుకుంటే ఇంకాస్త ముందు బయలుదేరండి.లేదంటే లేటుగా వస్తానని వాళ్ళకి చెప్పండి.

అంతేగాని లేట్ అయిపోతుంది కదా ఎక్కువ స్పీడ్ తో ప్రయాణం చేయవద్దు.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఓవర్ టేక్ చేసే క్రమంలో లారి టైర్ కింద పడి గాయాల పాలైన వీడియోను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ అధికారిక ట్విటర్‌ ద్వారా ”ఈ వీడియో ద్వారా మీరు ఏమీ గమనించారు ” అనే క్యాప్షన్‌ తో షేర్‌ చేసారు.

సీసీటీవిలో రికార్డు అయిన ఈ వీడియోలోని యాక్సిడెంట్ బాచుపల్లి అనే ప్రాంతంలో జరిగింది.ఈ వీడియోను ఒకసారి పరిశీలిస్తే తక్కువ ట్రాఫిక్ తో ఉన్న రోడ్డు మీద కొన్ని కార్లు, బైక్స్ ఒకదాని తరువాత ఒకటి వెళ్తుంటాయి.

అలాగే ఒక లారి, ఇన్నోవా వాహనం కూడా వెళ్తున్నాయి.ఇంతలోనే బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి ఇన్నోవాకు అతి సమీపంలో వచ్చాడు.

ఆ తరువాత దానిని ఓవర్‌ టేక్‌ చేసేందుకు ముందుకు వెళ్తాడు బైకర్.ఆ సమయంలో అటుగా వస్తున్న లారీ డ్రైవర్ ఆ బైకర్ ను గమనించలేదు.

ఇంకేముంది లారీ డ్రైవర్ బైకర్ ని ఢీ కొడతాడు.బైక్ మీద ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఎగిరి లారీ టైర్ కింద పడతాడు.ఏమి జరిగిందో అనే చూడడానికి లారీలో ఉన్న ఒక వ్యక్తి కిందకు దిగి చూస్తుంటాడు.టైర్ కింద ఉన్న వ్యక్తిని చూసి డ్రైవర్ కి చెప్పే ప్రయత్నం చేస్తాడు.

టైర్ కింద మనిషి ఉన్నాడని గమనించని ఆ లారీ డ్రైవర్ లారీని ముందుకు కదిలిస్తాడు.మళ్ళీ లారీ టైరు ఆ వ్యక్తి మీద ఎక్కుతుంది.కనీసం ఒక మూడు సార్లు అయిన ఆ వ్యక్తి మీద లారీ టైరు ఎక్కడాన్ని మనం వీడియోలో గమనించవచ్చు.

అయితే అతను బతికే ఉన్నాడా లేదంటే చనిపోయాడా అనే వివరాలు తెలియలేదు.ఓవర్ టేక్ చేసి తొందరగా వెళ్లాలని స్పీడ్ గా డ్రైవ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది.రెప్ప పాటులో అంత జరిగిపోయింది.

అందుకే రోడ్డు మీద ప్రయాణం అనేది కత్తి మీద సాము లాంటిది అంటారు.అయితే ఈ వీడియోను ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం వీడియోని షేర్‌ చేశామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

#Bachupalli #Shared #Break #Rules #Cyberabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు