వైరల్ వీడియో: గోల్ఫ్ కోర్సులో ప్రత్యక్షమైన మొసలి..!

మొసలి అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.అప్పుడప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొసలి దాడుల గురించి మనం సోషల్ మీడియాలోనో లేకపోతే టీవీలలో చూస్తూనే ఉంటాం.

 Crocodile Found In Golf Course, Golf Course, America, Florida, Crocodile, Social-TeluguStop.com

అలాంటిది ఎవరికైనా ఓ పెద్ద మొసలి ఎదురుగా వస్తే ఇంకా ఏమైనా ఉందా.? వారికి ఏదైనా గుండె కు సంబంధించిన వ్యాధులు ఉంటే వారు అక్కడికక్కడే ప్రాణం వదలడం ఖాయం.ఇకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాలలో అధిక వర్షాలు కురవడంతో ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలోకి వరదనీటిలో కొట్టుకొని వచ్చిన సంఘటనలు కూడా ఎన్నో చూశాం.ఇక అసలు విషయంలోకి వెళితే.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ మధ్య కాస్త మొసళ్ల సంచారం ఎక్కువగా కనబడుతోంది.రాష్ట్రంలోని ఉన్న నదులు, సరస్సులు నుండి తరచుగా అవి చుట్టుపక్కల ప్రజలు జీవిస్తున్న ప్రాంతాలలోకి వచ్చేస్తున్నాయి.

దీంతో అక్కడి ప్రజలు బాగా భయబ్రాంతులకు లోనవుతున్నారు.ఓ మంచినీటి సరసు పక్కన ఉన్న గోల్ఫ్ కోర్స్ లో అందరూ గోల్ఫ్ క్రీడ ఆడుతున్న సమయంలో ఓ మొసలి గోల్ఫ్ కోర్సు లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అందరూ ఆటలో నిమగ్నమై ఉన్న సమయంలో ఓ మొసలి అలా గోల్ఫ్ కోర్సులోకి రావడంతో అందరూ ఒకింత షాక్ కి గురయ్యారు.ఇంకేముంది అక్కడ ఆడుతున్న ఆటగాళ్లు అలాగే కొందరు వ్యక్తులు ఆ ప్రదేశం నుంచి పారిపోయారు.

అయితే ఆ గోల్ఫ్ కోర్స్ లో పని చేస్తున్న ఉద్యోగి మాత్రం ఆ మొసలి వెళుతున్న సమయంలో వీడియోని రికార్డ్ చేశాడు.

ఆ సమయంలో రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అతడు షేర్ చేశాడు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ గా మారింది.అయితే ఆ మొసలి మాత్రం ఒక సరస్సులో నుండి మరో సరస్సులోకి వెళ్లేందుకు ప్రశాంతంగా వెళుతూ ఉంది.

అయితే ఇలా గోల్ఫ్ కోర్స్ లోకి మొసళ్లు రావడం ఇదే మొదటిసారి కాదట.అక్కడ పనిచేసే ఉద్యోగులు అనేక సార్లు ఇలా మొసళ్లు వెళ్తుండటం గమనించినట్లు వారు పేర్కొన్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ మొసలి గోల్ఫ్ కోర్సులో ఎలా వెళ్ళిందో చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube