వైరల్ వీడియో: నదిలోని నీరు తాగేందుకు వెళ్లిన శునకాన్ని మొసలి ఏకంగా..?!

శునకాలను చాలా మంది ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు.ఇక కొన్ని శునకాలు వీధుల్లో తిరుగుతూ రాత్రిపూట అరుస్తూ ఉంటాయి.

 Viral Video A Crocodile Eaten A Dog Alive In Chambal River,  Crocodile, Dog, Vir-TeluguStop.com

మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్క.సుమారు 14,000 ఏళ్ల కిందటి నుంచే కుక్కలు మనుషులతో కలిసి జీవించడం నేర్చుకున్నాయని చెబుతారు.

డెన్మార్క్, జెర్మనీ, చైనా, జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనకు తెలుస్తుంది.కుక్కలు అత్యంత నమ్మకం గల జంతువు అని చెబుతారు.

భారత్ లో కుక్కను కాలభైరవుడు అని దైవంగా పూజిస్తారు.వారణాసిలో కాలభైరవ ఆలయం కూడా ఉంది.

కుక్కలను పోలీసులు కూడా వివిధ పనుల్లో వాడతారు.కుక్క మనిషికి ఒక ఫ్రెండ్ లాంటిది.కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి.మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఏర్పరుచుకుంటారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.తాజాగా కుక్కకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో నీళ్లు తాగడానికి నది ఒడ్డుకు వెళ్లిన ఓ కుక్కను నీటిలో ఉన్న మొసలి మింగేసింది.అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు మొసలి కుక్కను మింగుతున్న సమయంలో వీడియో తీశారు కానీ దానిని రక్షించే ప్రయత్నం చేయలేదు.ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం చంబల్‌లోని కలియసోట్ డ్యామ్ బ్యాక్ వాటర్‌ లో జరిగింది.

చంబల్ నదిపై ఉన్న కలియసోట్ డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద ఓ కుక్క దాహం తీర్చుకునేందుకు వెళ్లింది.

అది నీళ్లు తాగుతుండగా.మొసలి గమనించి మెల్లిగా వచ్చి అమాంతం ఆ శునకాన్ని మింగేసింది.

అక్కడ ఉన్నవారు ఇదంతా కెమెరాలో బంధించారు.

కానీ ఆ కుక్కను కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు.ఆ కుక్కను అక్కడి నుంచి వెళ్లగొట్టినా అది మొసలికి చిక్కేది కాదు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

అది వైరల్‌ అయ్యింది.వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియో తీసిన వారిపై మండిపడుతున్నారు.

ఈ వీడియోపై డ్యామ్ అధికారులు స్పందించారు.డ్యామ్‌లో మొసళ్లు ఎక్కువగా ఉన్నాయని, వేసవి కాలం కావడంతో నది లోపల వేడిమిని తట్టుకోలేక ఆ మొసళ్లు నది ఒడ్డుకు వస్తాయని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube