వైరల్ వీడియో: వార్డులో నీళ్లు లేవంటూ మృతి చెందిన కరోనా పేషెంట్..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమంది కరోనా బాధితులు ఆక్సిజన్ అందక, బెడ్స్ కొరతతో ఇలా పలు ఇబ్బందులు కారణంతో మృత్యువాత పడుతున్నారు.

 Viral Video Corona Patient Died Lack Of Water In Sushila Tiwari Hospital Uttarak-TeluguStop.com

తాజాగా తాగేందుకు నీరు లేవన్న కారణంతో ఒక కరోనా రోగి మృతి చెందిన దారుణ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ జిల్లా సుశీలా తివారీ ఆస్పత్రిలో సదరు కరోనా రోగికి చికిత్స అందజేస్తున్నారు.ఈ క్రమంలో తాగే నీరు అందుబాటులో లేదని బాగా దాహం ఉంది అంటూ ఆ కరోనా రోగి వేడుకోవడం మనం వీడియోలో గమనించవచ్చు.వెంటనే నీళ్లు పంపాలని ప్రాధేయపడినా ఎంత మాత్రం ఆసుపత్రి వర్గాలు నీరు అందకపోవడంతో ఆ మహిళ తాజాగా మృతి చెందారు.

ఈ క్రమంలో సదరు మహిళ  “నేను సుశీలా తివారీ ఆస్పత్రిలోని కొవిడ్​ కేర్ వార్డ్‌ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను.గత రాత్రి నుంచి ఇక్కడ మంచినీరు లేదు.

వీలైనంత త్వరగా మాకు నీరు సమకూర్చండి ప్లీజ్.నాతోపాటు ఇక్కడ చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సంఘటనలో భాగంగా సుశీలా తివారీ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఆ  మహిళ చనిపోయిందని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

కానీ  అధికారులు మాత్రం దాన్ని ఖండిస్తూ ఒక్కొక్క కరోనా రోగికి నాలుగు బాటిళ్ల  నీటిని అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు.అయితే ఆ మహిళ  ఆరోగ్యం విషమించడం వల్లనే మృతి చెందిందనిహాస్పిటల్ సిబ్బంది వారు పేర్కొన్నారు.

ఏది ఏమైనా ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ శృతి మించడంతో చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరినీ కలిచివేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube