వైరల్ వీడియో: దుబాయ్ వీధుల్లో సందడి చేసిన రంగురంగుల నెమళ్లు..!

నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే మైమరచి చూడాల్సిందే.అయితే మగ నెమలి.

 Viral Video Colorful Peacocks Mesmerizing In Dubai Streets Details, Viral Video,-TeluguStop.com

ఆడనెమలిని ఆకర్షించేందుకు పురివిప్పి నాట్యం చేస్తుందంటారు.నెమలి పురివిప్పి నాట్యమాడుతుంటే అది చూడ్డానికి రెండు కళ్లు చాలవు.

అలాగే నెమలి పించం కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేస్తుంది.నెమలి పించం ఇంట్లో ఉంటే.

రోజు వారీ జీవితంలో చాలా సమస్యల్ని పోగొడుతుందని పండితులు చెబుతుంటారు.అయితే, ఇలాంటి అందమైన నెమళ్ళు.

జనాలు తిరిగే ప్రదేశంలో కనిపించడం చాలా అరుదు.వాటిని మనం కేవలం పార్కుల్లో లేదా అడవుల్లో మాత్రమే చూడగలం.

అయితే, జనావాసాల్లో ఎంతో అరుదుగా కనిపించే నెమళ్ళు.దుబాయి రోడ్లపై సందడి చేశాయి.ఒకటి కాదు రెండు కాదు.ఏకంగా 50 నెమళ్లు ఆ రోడ్లపై కొచ్చాయి.

అయితే, ఈ నెమళ్ళ గుంపులో.ఆడ, మగ నెమళ్లు కలిసి ఉన్నాయి.

సాధారణంగా ఆడ, మగ నెమళ్ళు కలసి ఒకచోటనే ఉండడం చాలా తక్కువ.కానీ ఇక్కడ మాత్రం అవన్నీ కలిసి కనువిందు చేశాయి.

వాటిని పలువురు ఫోటోలు, వీడియోల రూపంలో తమ కెమెరాల్లో బంధించారు.

ఓ ప్రముఖ బుల్లితెరకు సంబందించిన బాలీవుడ్ నటి ఆ సమయంలో దుబాయిలో పర్యటిస్తోంది.ఆమె కూడా ఈ నెమళ్లను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఆహా.ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూసాక నా మనసు పులకరించి పోయింది అంటూ.అమె క్యాప్సన్ ఇచ్చింది.

కాగా ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే.

ఈ నెమళ్ళ గుంపులోని ఓ నెమలి పురివిప్పి నాట్యం చేయడం పలువురిని ఎంతో ఆకర్షిస్తుంది.ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube