వైరల్ వీడియో: క్వారంటైన్ పూర్తికావడంతో రెచ్చిపోయిన క్రిస్ గేల్..!

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ మ్యాచ్ లో ఉన్నాడంటే ఎటువంటి ప్రభావితం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ 14 కొరకు క్రిస్ గేల్ పంజాబ్ కింగ్స్ జట్టులో ఆడేందుకు తాను ఉండాల్సిన 7 రోజుల క్వారంటైన్ సమయాన్ని పూర్తి చేసిన సందర్భంగా తాజాగా అతను ఓ అదిరిపోయే వీడియోని విడుదల చేశాడు.

 Viral Video Chris Gay Provoked By The Completion Of The Quarantine-TeluguStop.com

ఈ వీడియోలో అదిరిపోయే స్టెప్పులతో తన అభిమానులని, క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచాడు.క్వారంటైన్ పూర్తయిన సందర్భంగా.

ఏకంగా డాన్స్ రారాజు అయిన మైకేల్ జాక్సన్ సూపర్ హిట్ మూన్ వాక్ పాటకి డాన్స్ చేసి అదుర్స్ అనిపించాడు.

డ్యాన్స్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోను పంజాబ్ కింగ్స్ జట్టు తన అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.

దాంతో ఆ వీడియో కొద్ది సమయంలోనే కాస్త నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది.అయితే గేల్ క్వారంటైన్ సమయంలో అనేక పంజాబీ పాటలకు తనదైన స్టైల్ లో స్టెప్పులేస్తూ కాలక్షేపం చేశాడని కింగ్స్ పంజాబ్ తెలిపింది.

క్వారంటైన్ సమయంలో అతడు ఎక్కువశాతం డాన్స్ చేయడమే కాకుండా జిమ్ లో వర్కౌట్లు చేస్తూ తన సమయాన్ని గడిపినట్లు తెలిపాడు.

ఇకపోతే రేపటి నుంచి మొదలయ్యే ఐపీఎల్ 14వ సీజన్ లో యూనివర్సల్ బాస్ ఆయన క్రిస్ గేల్ కింగ్స్ పంజాబ్ తరఫున రంగంలోకి దిగబోతున్నారు.ఇకపోతే గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో కాస్త ఆలస్యంగా బరిలోకి దిగిన క్రిస్ గేల్ తన ఫామ్ ఆడిన 7 మ్యాచ్ లలో చూపించగలిగాడు.గేల్ గత సీజన్ లో 7 మ్యాచ్ లలో 3 హాఫ్ సెంచరీలు సాధించగా మొత్తంగా 228 పరుగులు చేయగలిగాడు.

ఏప్రిల్ 9 నుంచి మొదలయ్యే ఐపీఎల్ 14 సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్ జట్టును ముంబై వేదికగా తలపడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube