వైరల్ వీడియో: చంద్రుడి పైకి చేరిన చైనా అంతరిక్ష నౌక..!

చంద్రునిపై ఉన్న నమూనాలను సేకరించడం కోసం చైనా దేశం పంపించిన చాంగే – 5 అంతరిక్ష నౌక మంగళవారం రోజున చంద్రుడు పై విజయవంతంగా ల్యాండ్ అయింది.ఈ విషయానికి సంబంధించి చైనా దేశ ప్రభుత్వం అధికారులు అధికారికంగా తెలియజేశారు.

 Viral Video China Spacecraft Reaches The Moon, Space, Moon, Chaina, Space Craft,-TeluguStop.com

ఈ పరీక్షలలో భాగంగా అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలం నుండి సేకరించిన రాళ్లను, మట్టిని భూమి మీదకు తీసుకు రాబోతోంది.ఈ నేపథ్యంలో అంతరిక్ష నౌక చంద్రుడిపై కాలు మోపిన దృశ్యాలను తాజాగా చైనా విడుదల చేసింది.

ఈ వీడియోని చైనా దేశపు మీడియా సంస్థ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

అందులో చంద్రుడిపై మిషన్ దిగిన స్థలం, అది తీసిన దృశ్యాలను భూమి మీదకు పంపించిందని తెలియజేశారు.

నవంబర్ 24న ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక ప్రయాణం కేవలం ఏడు రోజుల్లోనే చంద్రుడిపై విజయవంతంగా కాలు మోపిందని వారు అనుకున్న స్థలంలోనే అనుకున్న విధంగా అంతరిక్షనౌక ల్యాండ్ అయినట్లు చెప్పుకొచ్చారు.ఈ మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఇది వరకు ఎవరూ సందర్శించని ప్రదేశం నుండి ఏకంగా 2 కిలోల మట్టి నమూనాలను అంతరిక్ష నౌక భూమి మీదకు తీసుకరాబోతున్నట్లు చైనా అధికారులు తెలియజేశారు.

ఈ ప్రయోగం తరువాత.ప్రస్తుతం స్పేస్ క్రాఫ్ట్ ను మాత్రమే చంద్రుడిపైకి పంపామని, ఆ తర్వాత చంద్రుని మీదికి మనిషిని పంపుదామని ఆలోచిస్తున్నట్లు చైనా స్పేస్ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం చేస్తున్న మిషన్ సక్సెస్ అయితే చంద్రునిపై నుండి నమూనాలను సేకరించిన మూడో దేశంగా చైనా నిలబడుతుంది.ఇది వరకు కేవలం అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube