వైరల్ వీడియో: ఫ్రీ కార్ వాష్ చేస్తున్న చింపాంజీలు.. మనుషుల కన్నా బెటర్ తెలుసా..?!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా బాగా పాపులర్ అయిపొయింది.ఎక్కడ,ఎటువంటి వింతలు, విశేషాలు జరిగినా కానీ క్షణాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు.

 Viral Video: Chimpanzees Doing Free Car Wash Do You Know Better Than Humans, Ci-TeluguStop.com

ఆ వీడియోలు కాస్త క్షణాల్లో వైరల్ గా మారిపోతున్నాయి.మరి ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అవి చేసే వింత పనులను నెటిజన్లు కూడా బాగా లైక్ చేస్తున్నారు.కొన్ని వీడియోలు చూడడానికి భలే ఫన్నీగా ఉంటాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక చింపాంజీకి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

చింపాంజీలు చేసే ఈ పని చూస్తుంటే ఎవరికయినా సరే నవ్వు రావలిసిందే.

మామూలుగానే చింపాజీలు చాలా తెలివైన జంతువులు.మనుషులతో ఇట్టే కలిసిపోతాయి.

ఇంతకముందు కూడా ఇలా చింపాజీలు చిన్న పిల్లలతో ఆడుకుంటున్న వీడియోలు, బట్టలు ఉతుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.మళ్ళీ ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఈ వైరల్ వీడియోలో మనం ఒక రెండు చింపాంజీలు కారును శుభ్రం చేయడం మనం గమనించవచ్చు.

ఆగి ఉన్న ఒక నల్లటి కారుపైకి రెండు చింపాంజీలు ఎక్కి గ్లాస్‌ను ఒక క్లాత్ తో రుద్దుతూ తెగ శుభ్రం చేసేస్తున్నాయి.

అచ్చం మనుషుల మాదిరిగానే కారును క్లీన్ చేస్తున్నాయి.వాటిని చూస్తుంటే కార్ వాషింగ్ చేయడంలో ప్రొఫెషనల్స్‌లా కనిపిస్తున్నాయి కదా అని అనుకోకుండా ఉండలేరు.ఈ వీడియో జంతు ప్రేమికులను బాగా ఆకట్టుకుంటుంది.ఇప్పటి వరకూ ఈ వీడియోకు 10 లక్షలకు పైగా విక్షించగా.

, 41వేలకు పైగా లైక్స్ వచ్చాయి.అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఫ్రీ కార్ వాషింగ్ అంటూ ఒక ఫన్నీ కామెంట్ తో ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube