వైరల్ వీడియో: కుక్కతో ఇలా కూడా చేయించుకోవచ్చ..?!

చాలామంది పెంపుడు జంతువుల కింద కుక్కలను పెంచుకోవడం మనం చూసే ఉంటాము.వాటిని ఇంట్లో వ్యక్తులుగా బావిస్తూ వాటికి పుట్టినరోజులు జరపడం, కేక్ కటింగ్ చేయించడం లాంటివి ఎన్నో రకాల సెలెబ్రేషన్స్ చేస్తూ ఉంటారు.

 Viral Video Can This Be Done With A Dog-TeluguStop.com

అలాగే అవి కూడా వాళ్ళ యజమానులు చేసే పనులను అనుకరిస్తూ ఉంటాయి.కుక్కలు చేసే పనులను చాల మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మనం చూసే ఉంటాము.

మనం చేసే కొన్ని పనులను అవి కూడా చూసి అచ్చం మనం ఎలా అయితే చేస్తున్నామో అవి కూడా అలానే మనల్ని అనుకరిస్తూ ఉంటాయి.ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది.

 Viral Video Can This Be Done With A Dog-వైరల్ వీడియో: కుక్కతో ఇలా కూడా చేయించుకోవచ్చ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొద్ది రోజుల క్రితం ఓ మహిళ యోగా చేస్తుండగా తాను పెంచుకునే పెంపుడు కుక్క ఆమెను చూస్తూ అచ్చం ఆ మహిళలాగానే యోగా చేసి అందరిని ఆశ్చర్య పరిచింది.ఆ మహిళ తన పెంపుడు కుక్క చేసే ఫీట్స్ ను వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యి పెద్ద సంఖ్యలో లైకులు కొట్టేసింది.ఈ వీడియో హ్యుమన్ – డాగ్ రిలేషన్‌ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

మనం వాషింగ్ మెషిన్ లో బట్టలు ఎలా అయితే వేస్తామో ఆ కుక్క కూడా అచ్చం అలానే తన యజమానురాలిని అనుకరించి చేసింది.

మనం ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు కుక్కలు మనకు సహాయం చేస్తూ మన పనిలో చేదుడు వాదోడుగా ఉంటాయి.అయితే ఈ కుక్క మాత్రం తన యజమానురాలుకి ప్రతి పని చేసేస్తుంది.లాండ్రీ పని తర్వాత బట్టలు కూడా ఆరబెట్టింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.అలాగే ఈ వీడియోకి పోస్ట్ చేస్తూ ‘మేమిద్దరం కలిసి ఇవాళ ఉదయం లాండ్రీ పని చేశాం.

నా ఫ్రెండ్ తో కలిసి పనిచేయడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది’ అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వర్షం కురిసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కుక్కలు కూడా మనుషులు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఆ పనులను అనుకరిస్తాయి అనడానికి ఈ వీడియోలు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

#Training #Viral Video #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు