వైరల్ వీడియో: ఏనుగు దాడి చేసినా సీట్లో నుంచి కదలని బస్ డ్రైవర్..!

తమ గమ్యాలు చేరుకునేందుకు ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తుండగా దారి మధ్యలో ఓ ఏనుగు అడ్డుకుంది.బస్సు అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించింది.

 Viral Video Bus Driver Who Does Not Move From Seat Even If Attacked By Elephant,-TeluguStop.com

అయినా ఆ బస్సు నడిపే డ్రైవర్ ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా అక్కడే కూర్చున్నాడు.ఈ డ్రైవర్ ధైర్యానికి ఇప్పుడు చాలామంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సంఘటన తమిళనాడు కోటగిరి సమీపంలోని మొల్లాత పల్లం లో జరిగింది.వివరాల్లోకి వెళితే.

తమిళనాడు కోటగిరి సమీపం లోని మొల్లతపళ్ళెంకు ఓ బస్సు ప్రభుత్వ ఉద్యోగులను తీసుకెళ్తుంది.ఈ సమయంలో బస్సు పై ఓ ఏనుగు విరుచుకుపడింది.

ఏనుగు దాని తొండంతో బస్సు అద్దాలను ద్వంసం చేసింది.బస్సును బోల్తా పడేసేందుకు చాలా ప్రయత్నించింది.

అయినా దాని ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఇక్కడ విశేషం ఏంటంటే.

ఆ ఏనుగు అంత చేస్తున్న బస్సు డ్రైవర్ ఏ మాత్రం కదలకుండా దైర్యంగా కూర్చుండి పోయాడు.

ఏనుగు రెండోసారి కూడా బస్సును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించింది.

అయితే ఈసారి బస్సు డ్రైవర్ భయపడకుండా సీటులో నుంచి లేచి వెన్నక్కి వెళ్ళాడు.అక్కడ ప్రయాణికులను వెనక్కి వెళ్లాలని సూచించాడు.

ఈ దృశ్యాలను ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియో తీశారు.కొద్ది సేపటి తరువాత ఆ ఏనుగు అడవి లోకి వెళ్ళిపోయింది.

దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ఆ తరువాత బస్సు డ్రైవర్ ఉద్యోగులను సురక్షితంగా మెట్టు పాళ్యంకు చేర్చాడు.

అయితే ఇంత జరుగుతున్నా బస్సు డ్రైవర్ ఏ మాత్రం భయపడకుండా ఉండడం చూసి అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు.

తరుచూ ఆ మార్గంలో ఏనుగులు సంచరిస్తూనే ఉన్నాయని, గతంలో కూడా ఏనుగులు ఇలాగే దాడి చేశాయని బస్సు డ్రైవర్ తెలిపాడు.అందుకే ఏనుగు దాడి చేసినా భయపడలేదని, ఒకవేళ భయపడి ఉంటే బస్సులోని ఉద్యోగులు ఆందోళన చెంది కేకలు వేస్తారని, ఒకవేళ కేకలు వేస్తే ఏనుగుని రెచ్చిగొట్టినట్లు అవుతుందని అన్నారు.అప్పుడు ఇంకా దాడి తీవ్రత పెరిగే అవకాశం ఉందని, అందుకే దైర్యంగా ఉన్నానని తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube