వైరల్ వీడియో... కుక్క పట్ల దాత్రుత్వం చాటుకున్న బస్ డ్రైవర్

ప్రస్తుతం సాంకేతిక యుగంలో మానవ సంబంధాలు రోజు రోజుకు క్షీణిస్తున్న పరిస్థితులలో మూగ జీవాలపై మక్కువ చూపిస్తున్నారు.ఎందుకంటే అవి మనుషుల కంటే ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటాయి, అది కాక అవి చూపించే ప్రేమలో స్వార్థం ఉండదు.

 Bus Driver Saves Pet Dog On Busy Road, Viral Video, Bus Driver, Pet Dog, Netizen-TeluguStop.com

నిస్వార్థ మైన ప్రేమ ను చూపిస్తుంటాయి కాబట్టి వాటి పట్ల మనుషులు కూడా అత్యంత కృతజ్ఞతతో, జాలిగా ప్రవర్తిస్తారు.ఇక అసలు విషయంలోకి వస్తే ఓ శునకం పట్ల ఓ బస్ డ్రైవర్ మానవత్వం చాటుకున్న ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.

ఇక దారి తప్పి దారి తెలియక చిక్కుకున్న పెంపుడు కుక్కను బస్సులో ఎక్కించుకొని దానికి ఆహారం అందించి ఓ బస్ డ్రైవర్ మానవత్వాన్ని చాటుకున్నాడు.అయితే కుక్క దారి తప్పి తిరుగుతున్నదని గ్రహించిన బస్ డ్రైవర్ పాసింజర్ల అనుమతితో ఆ బస్సు డ్రైవర్ బస్ డిపోకు తీసుకెళ్లాడు.

అయితే తన కుక్క జాడ తెలుసుకున్న కుక్క యజమాని సదరు బస్ డ్రైవర్ కు నగదు పురస్కారం ఇవ్వబోయాడు.కాని అందుకు ఆ సదరు బస్ డ్రైవర్ నిరాకరించాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.బస్సు ఆగినప్పుడు కుక్క బస్సు లోకి ఎక్కుతున్న వీడియోను చూస్తున్న నెటిజన్లు ఎంత గొప్ప వ్యక్తి అయితే తప్ప ఇలాంటి పనులు చేయలేరు అని బస్ డ్రైవర్ ను ఆకాశానికెత్తేస్తున్నారు.

ఈ బస్ డ్రైవర్ చేసిన పని సూపర్ అంటూ ఇంకొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube